
Urine: మూత్రంతో పంట సాగు..రెండింతల దిగుబడి..సైంటిస్ట్‌లే చెబుతున్నారు
Urine: ప్రస్తుత కాలంలో రసాయన ఎరువుల వాడకం వల్ల భూమి నిస్సారమవడమే కాకుండా పర్యావరణం కూడా దెబ్బతింటోంది. ఈ క్రమంలో ప్రాచీన రోమ్, చైనా నాటి ఓ అద్భుతమైన విధానం మళ్ళీ తెరపైకి వచ్చింది.
Urine: ప్రస్తుత కాలంలో రసాయన ఎరువుల వాడకం వల్ల భూమి నిస్సారమవడమే కాకుండా పర్యావరణం కూడా దెబ్బతింటోంది. ఈ క్రమంలో ప్రాచీన రోమ్, చైనా నాటి ఓ అద్భుతమైన విధానం మళ్ళీ తెరపైకి వచ్చింది. అదే 'పీసైక్లింగ్' .. అంటే మూత్రాన్ని ఎరువుగా మార్చడం.మనం వ్యర్థంగా భావించే మూత్రం ఇప్పుడు పంట పొలాలకు మేలైన పోషక నిధిగా మారుతోంది. అమెరికాలోని వెర్మాంట్‌కు చెందిన వెస్టీ విలియమ్స్ అనే మహిళ గత 12 ఏళ్లుగా తన మూత్రాన్ని వృధా చేయకుండా సేకరించి రైతులకు అందిస్తున్నారు. వినడానికి కాస్త వింతగా ఉన్నా, ఇది పర్యావరణాన్ని కాపాడే ఒక గొప్ప సుస్థిర మార్గం.
వెర్మాంట్‌లోని రిచ్ ఎర్త్ ఇనిస్టిట్యూట్ ఈ సేకరణలో కీలక పాత్ర పోషిస్తోంది. వింధామ్ కౌంటీలో దాదాపు 250 మంది దాతలు ఏటా 45,400 లీటర్ల మూత్రాన్ని సేకరిస్తున్నారు. ఈ మూత్రాన్ని లారీల్లో తరలించి, 80°C వద్ద 90 సెకన్ల పాటు పాశ్చరైజేషన్ చేస్తారు. తద్వారా అందులోని హానికర బ్యాక్టీరియా నశించి, పోషకాలు నిండిన సహజ ఎరువు సిద్ధమవుతుంది.
మనం వాడే కృత్రిమ ఎరువుల్లో ఉండే నైట్రోజన్, ఫాస్ఫరస్ మూత్రంలో సహజంగానే పుష్కలంగా ఉంటాయి.శాస్త్రవేత్తల ప్రకారం, ఈ మూత్ర ఎరువు వాడటం వల్ల బచ్చలికూర వంటి పంటల దిగుబడి రెండింతలు పెరుగుతుంది.కృత్రిమ ఎరువుల తయారీలో శిలాజ ఇంధనాలు వాడతారు, ఇది కాలుష్యానికి కారణమవుతుంది. కానీ, పీసైక్లింగ్ వల్ల గ్రీన్‌హౌస్ ఉద్గారాలు తగ్గుతాయి. మూత్రం నేరుగా నీటిలో కలిస్తే ఆల్గే పెరిగి జలచరాలు మరణిస్తాయి. అదే మూత్రాన్ని భూమికి ఇస్తే, అది పంటలకు ఆహారమవుతుంది.
కేవలం అమెరికాలోనే కాదు.. పారిస్, స్వీడన్, దక్షిణాఫ్రికా, నేపాల్ వంటి దేశాల్లో కూడా పీసైక్లింగ్ పైలెట్ ప్రాజెక్టులు విజయవంతంగా నడుస్తున్నాయి. ఇందులో మందుల అవశేషాలు ఉంటాయనే సందేహం ఉన్నప్పటికీ, ప్రాథమిక పరిశోధనల్లో అవి చాలా తక్కువ మొత్తంలోనే ఉంటాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేలింది. నిన్నటి వ్యర్థం.. నేటి ఇంధనం. వెర్మాంత్ రైతులు అనుసరిస్తున్న ఈ విధానం భవిష్యత్తులో ప్రపంచ వ్యవసాయ రంగానికి దిక్సూచిగా మారబోతోంది. మన శరీరమే సృష్టించే ఈ సహజ పోషకాలను మట్టికి అందిస్తే, అది మనకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తిరిగి ఇస్తుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




