అంతరిక్షంలో అస్థికల ప్రయోగం విఫలమైందా? చివరిదశలో ట్రాజెడీ – సముద్రంలో కలిసిపోయిన 166 మంది అవశేషాలు

అంతరిక్షంలో అస్థికల ప్రయోగం విఫలమైందా? చివరిదశలో ట్రాజెడీ – సముద్రంలో కలిసిపోయిన 166 మంది అవశేషాలు
x

అంతరిక్షంలో అస్థికల ప్రయోగం విఫలమైందా? చివరిదశలో ట్రాజెడీ – సముద్రంలో కలిసిపోయిన 166 మంది అవశేషాలు

Highlights

అంతరిక్షంలోకి 166 మంది అస్థికలతో ప్రయోగించిన స్పేస్‌ క్యాప్సుల్‌ భూలోక వాతావరణంలో తిరిగొస్తుండగా కంట్రోల్ కోల్పోయింది. పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోవడంతో ఆ అవశేషాలన్నీ అక్కడే కలిసిపోయాయి. వివరాలు చదవండి.

ప్రియమైన వారు ఈ లోకాన్ని వదిలిపెట్టి చాలాకాలమే అయినా, వారి జ్ఞాపకాలను అంతరిక్షంలో పదిలంగా ఉంచాలని పలువురు కుటుంబాలు ఆశించారు. కానీ వారి భావోద్వేగ ప్రయాణం విషాదాంతంగా ముగిసింది. అంతరిక్షంలోకి తీసుకెళ్లిన 166 మంది అస్థికలు చివరకు పసిఫిక్ మహాసముద్రం లో కలిసిపోయాయి. ఈ స్పేస్‌ బరియల్ ప్రయోగం చివరి నిమిషంలో విఫలమైంది.

అంతరిక్షానికి జ్ఞాపకాల ప్రయోగం

జర్మనీకి చెందిన ‘ది ఎక్స్‌ప్లోరేషన్‌ కంపెనీ’ అనే స్టార్టప్ సంస్థ, అమెరికాకు చెందిన సెలెస్టిస్‌ (Celestis) అనే స్పేస్ బరియల్ కంపెనీతో కలిసి ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ పేరుతో ఈ వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. జూన్ 23, 2025న ‘NYX Capsule’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 166 మంది DNA, అస్థికలు, కొన్ని విత్తనాలు, ఇతర స్మరణార్థ పదార్థాలను భూమి కక్ష్యలోకి పంపించారు.

ఈ స్పేస్ కాప్సూల్‌ భూమిని రెండు కక్ష్యలలో చుట్టి తిరిగి భూలోక వాతావరణంలోకి ప్రవేశించి సురక్షితంగా తిరిగి దిగాల్సి ఉండేది.

చివరిదశలో విఫలం.. సముద్రంలో కూలిన స్పేస్ క్యాప్సుల్‌

ప్రారంభ దశలో క్యాప్సూల్‌ విజయవంతంగా ముందుకు సాగింది. కానీ, భూమికి తిరిగి వచ్చే సమయంలో, కంట్రోల్ సెంటర్‌తో సంబంధాలు కోల్పోయింది. కొన్ని క్షణాల్లోనే అది పసిఫిక్ మహాసముద్రంలో కుప్పకూలినట్లు సంస్థ ప్రకటించింది. దీంతో ఆ 166 మంది అవశేషాలు ఇక సముద్రగర్భంలో కలిసిపోయినట్లే.

బాధిత కుటుంబాలకు క్షమాపణలు తెలిపిన సంస్థ

ఈ ప్రమాదంపై స్పందించిన ‘ది ఎక్స్‌ప్లోరేషన్‌ కంపెనీ’ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

“మేం చేపట్టిన ప్రయోగం ఓ చారిత్రక యత్నం. కానీ, చివరిదశలో జరిగిన లోపంతో అస్థికలు సముద్రంలో కలిసిపోయాయి. మేము మా క్లయింట్లకు హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాం. అయినా వారు ఓ చారిత్రక ప్రయాణానికి భాగస్వాములయ్యారని భావిస్తున్నాం” అని తెలిపింది.

అంతరిక్ష అంత్యక్రియలు: కొత్త భావన.. కొత్త బాధ

ఈ మిషన్‌ ద్వారా loved ones‌ జ్ఞాపకాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే ‘స్పేస్ బరియల్‌’ (Space Burial) పద్దతికి మరింత గుర్తింపు లభించనుందనుకున్నారు. కానీ ఈ ఘోర వైఫల్యం భవిష్యత్ స్పేస్‌ మిషన్లపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories