Alaska Aircraft: మరో ఘోర విమాన ప్రమాదం.. పైలట్ సహా 10 మంది దుర్మరణం

Alaska Aircraft: మరో ఘోర విమాన ప్రమాదం.. పైలట్ సహా 10 మంది దుర్మరణం
x
Highlights

Alaska Aircraft: పశ్చిమ అలాస్కాలోని నోమ్ కమ్యూనిటీకి వెళ్తున్న విమానం కుప్పకూలిపోయింది. ఈ ఘటనల పైలట్ సహా 10 మంది దుర్మరణం చెందారు. విమానశిథిలాలను...

Alaska Aircraft: పశ్చిమ అలాస్కాలోని నోమ్ కమ్యూనిటీకి వెళ్తున్న విమానం కుప్పకూలిపోయింది. ఈ ఘటనల పైలట్ సహా 10 మంది దుర్మరణం చెందారు. విమానశిథిలాలను సముద్రంలో గుర్తించారు. అమెరికా కోస్ట్ గార్డ్ ప్రతినిధి మైక్ సలెర్నో మాట్లాడుతూ రెస్క్యూవర్కర్స్ విమానం కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. విమానం టేకాఫ్ అయిన గంటలోపే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. అలాస్కా డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ప్రకారం..బెరింగ్ ఎయిర్ సింగిల్ ఇంజిన్ టార్బోప్రాప్ విమానం గురువారం మధ్యాహ్నం 9 మంది ప్రయాణికులు, పైలట్ తో ఉనల్కలేట్ నుంచి బయలుదేరింది.

డేవిడ్ ఓల్సన్, బేరింగ్ ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్, సెస్నా కారవాన్ ఉనల్కట్ నుంచి మధ్యాహ్నం 2.37 గంటలకు బయలుదేరింది. నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం..అక్కడ తేలికపాటి హిమపాతం, పొగమంచు ఉంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. కోస్ట్ గార్డ్ లెఫ్టినెంట్ కమాండర్ బెంజమిన్ మెక్ ఇంటైర్ కోబుల్ మాట్లాడుతూ..విమానానికి ఏం జరిగిందో తాను ఊహించలేనని విమానం నుంచి ఎలాంటి డిస్ట్రెస్ సిగ్నల్ గురించి తనకు తెలియదని పేర్కొన్నారు. విమానాల్లో అత్యవసర లొకేటింగ్ ట్రాన్స్ మిటర్ ఉంటుందని..విమానానికి ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడు ఆ పరికరం ఉపగ్రహానికి ఓ సంకేతాన్ని పంపుతుందని..ఆ తర్వాత ఆ సందేశాన్ని కోస్ట్ గార్డ్ కు పంపుతుందని..అయితే ఈ ఘటనలో కోస్ట్ గార్డ్ కు ఎలాంటి ప్రమాదం రాలేదు అని తెలిపారు.

బెరింగ్ ఎయిర్ పశ్చిమ అలాస్కాలోని 32 గ్రామాలకు నోమ్, కోట్జెబ్యూ, ఉనల్కలేట్ హబ్ ల నుంచి సేవలు అందిస్తుంది. ఇదెలా ఉండగా జనవరి 29న అమెరికాలోని వాష్టింగ్టన్ సమీపంలో అమెరికన్ ఎయిర్ లైన్స్ జెట్, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొనడంతో 67మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. జనవరి 31న ఫిలడెల్ఫియాలో రవాణా విమానం కూలింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అలాస్కా విమాన ప్రమాదంలో 10 మంది మరణించారు. అమెరికాలో గత 8 రోజుల్లో జరిగిన 3 విమాన ప్రమాదాల్లో దాదాపు 84 మంది ప్రాణాలు కోల్పోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories