Bangkok Earthquake: బ్యాంకాక్‌ భూకంపంలో కుప్పకూలిన 30 అంతస్తుల బిల్డింగ్.. లోపలే చిక్కుకున్న 43 మంది

Myanmar earthquake, Earthquake, Myanmar, Magnitude, Bangkok, Viral videos, Earthquake in Myanmar, Myanmar, Bangkok Earthquake, Thailand Earthquake, skyscraper building collapsed in Bangkok, Bangkok skyscraper building collapsed
x

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Highlights

Skyscraper building collapsed in Bangkok: మయన్మార్‌లో సంభవించిన భూకంపం ప్రభావం బ్యాంకాక్‌లో భారీగా కనిపించింది. నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల భవనం కళ్లు...

Skyscraper building collapsed in Bangkok: మయన్మార్‌లో సంభవించిన భూకంపం ప్రభావం బ్యాంకాక్‌లో భారీగా కనిపించింది. నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల భవనం కళ్లు మూసి తెరిసేలోగా కుప్పకూలిపోయింది. బ్యాంకాక్ ప్రభుత్వంలోని పలు శాఖల కార్యాలయాల కోసం ఆ భవనాన్ని నిర్మిస్తున్నారు.

భవనం నిర్మాణంలో ఉండగా ఈ ప్రమాదం జరగడంతో 43 మంది కార్మికులు అందులోనే ఉన్నట్లు తెలుస్తోంది.

భవనం కుప్పకూలిన తీరు చూస్తోంటే అందులో ఎవ్వరూ ప్రాణాలతో మిగిలి ఉండే అవకాశం లేదని బ్యాంకాక్ మీడియా కథనాలు చెబుతున్నాయి.

మయన్మార్‌‌లోని మండలయ్‌లో థాయ్‌లాండ్‌లోని బ్యాంకాంక్‌‌‌లో పలు భవనాలు నేలకూలాయి. ఇంకొన్ని పెద్దపెద్ద భవనాలు ఇకపై ఉండటానికి వీల్లేకుండా ఒక పక్కకు ఒరిగిపోయాయి. అనేక భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో ఆయా నగరాల్లో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories