Covid-19: మళ్లీ పంజా విరుసుతోన్న కోవిడ్ 19..కేసులు పెరుగుతుండడంతో కొత్త వ్యాక్సిన్‌కు ఆమోదం..!

A new Covid-19 vaccine has been approved amid rising corona infections in many countries - this variant is raising concerns
x

Covid-19: మళ్లీ పంజా విరుసుతోన్న కోవిడ్ 19..కేసులు పెరుగుతుండడంతో కొత్త వ్యాక్సిన్‌కు ఆమోదం..!

Highlights

Covid-19: ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఆసియా దేశాల్లో పెరుగుుతన్న కోవిడ్ కేసులు ఆరోగ్య నిపుణుల్లో ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. గత కొన్ని వారా్లో...

Covid-19: ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఆసియా దేశాల్లో పెరుగుుతన్న కోవిడ్ కేసులు ఆరోగ్య నిపుణుల్లో ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. గత కొన్ని వారా్లో కోవిడ్ కేసులు గణనీయంగా పెరిగాయని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కోవిడ్ ఇన్ఫెక్షన్ కేసులు పెరగడమే కాకుండా చాలా చోట్ల ఆసుపత్రుల్లో చేరే రోగుల సంఖ్య కూడా పెరిగింది. ఈ పెరుగుతున్న కేసులకు కొత్త వేరియంట్ కారణమని ఇప్పటి వరకు నిపుణులు వెల్లడించలేదు. అయితే వ్యాక్సిన్ ఇమ్యూనిటీ శక్తి తగ్గుతోందని..ఫలితంగా వైరస్ ప్రభావం మరోసారి కనిపిస్తోందని నిపుణులుహెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తుగా కోవిడ్ కు బూస్టర్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతో రక్షణ ఉంటుందంటున్నారు.

గతంలో ఫ్లూ మాదిరిగానే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని పలు ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి. ఆగ్నేసియాలోని అనేక ప్రాంతాల్లో కోవిడ్ 19 కొత్త వేరియంట్ తర్వాత ప్రజల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వైరస్ మరోసారి వినాశనం కలిగించబోతోందా..కోవిడ్ 19 నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు మనందరం మునుపటివలే చర్యలు తీసుకోవాలా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఈ క్రమంలోనే బ్లూమ్ బెర్గ్ రిపోర్టు ప్రకారం..హాంకాంగ్, సింగపూర్ వంటి నగరాల్లో ఆసుపత్రిలో చేరడం, మరణాలతోపాటు కొత్త కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దాదాపు ఏడాది తర్వాత తొలిసారి కేసులు పెరుగుతున్నాయి. అనేక దేశాల్లో పెరుగుతున్న ప్రమాదాలను చూసి ఆరోగ్య సంస్థలు ప్రజలను మరింత అలర్ట్ చేశాయి. మరోవైపు పెరుగుతున్న ముప్పు మధ్య అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నోవావాక్స్ కొత్త వ్యాక్సిన్ ను ఆమోదించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories