America: అమెరికా ప్రయాణంపై ఆంక్షల సడలింపు

America Ease the Travel Restrictions on Tourists
x

ప్రయాణికులపై ఆంక్షలు సడలింపు చేసిన అమెరికా (ఫైల్ ఇమేజ్)

Highlights

America: పూర్తిస్థాయిలో టీకాలు తీసుకుంటేనే అనుమతి * అలాంటి వారికి క్వారంటైన్‌ రద్దు

America: అమెరికాలో పర్యటించనున్న విదేశీయులపై ఆ దేశం ఆంక్షలను సడలించింది. తమ దేశం వచ్చే ఫ్లైట్ ఎక్కడానికి ముందే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ వేయించుకోవాలని షరతు పెట్టింది. దేశంలో అడుగుపెట్టిన తర్వాత అలాంటి వారికి క్వారంటైన్‌ అవసరం ఉండదని స్పష్టం చేసింది. మరోవైపు... భారత్‌ తదితర దేశాలపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తేసింది. నవంబరు నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది.

కరోనా నుంచి అమెరికన్లకు రక్షణ కల్పించడం, అంతర్జాతీయ ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చడమే లక్ష్యంగా కొత్త అంతర్జాతీయ పర్యాటక విధానాన్ని తీసుకొచ్చామన్నారు. ఇకపై పూర్తిస్థాయిలో టీకాలు తీసుకున్న విదేశీయులే అమెరికా వచ్చే విమానాలను ఎక్కాల్సి ఉంటుంది. వారు టీకా ధ్రువపత్రాలతో పాటు అమెరికా ఫ్లైట్ ఎక్కడానికి మూడు రోజుల్లోపు కొవిడ్‌ పరీక్ష చేయించుకుని, నెగెటివ్‌ ఫలితం వచ్చినట్టు రిపోర్టు కూడా చూపించాలి.

ఏయే వ్యాక్సిన్లు తీసుకున్నవారిని దేశంలోకి అనుమతించాలన్నది సీడీసీ నిర్ణయిస్తుంది. టీకాలు తీసుకోకుండా ఇతర దేశాల నుంచి తిరిగివచ్చే అమెరికన్లు కూడా విమానం ఎక్కడానికి ముందురోజు కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాలి. దేశానికి వచ్చిన తర్వాత కూడా వారికి మరోసారి టెస్ట్‌ తప్పదు.

అమెరికా వచ్చే ప్రతి వ్యక్తి నుంచి వారి ఫోన్‌ నంబరు, ఈ-మెయిల్‌, ఇతర వివరాలను సేకరించేలా సీడీసీ ఆదేశాలు ఇవ్వనుంది. దేశంలోకి వచ్చిన తర్వాత వీరిలో ఎవరైనా కొవిడ్‌ బారిన పడితే వారితో కాంటాక్టు అయినవారిని త్వరగా గుర్తించేందుకు ఈ వివరాలు ఉపయోగపడతాయి. విమానాల్లో ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధ్యక్షుడు బైడెన్‌ ఇప్పటికే సూచించారు. కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించేవారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories