America Pakistan: పాకిస్థాన్‌కు అమెరికా ఎందుకంత ప్రాధాన్యత ఇస్తోందో తెలుసా?

America Pakistan
x

America Pakistan: పాకిస్థాన్‌కు అమెరికా ఎందుకంత ప్రాధాన్యత ఇస్తోందో తెలుసా?

Highlights

America Pakistan: పాకిస్థాన్‌లో ఉగ్రవాదం పెరిగిందని అందరికీ తెలుసు.. భారత్‌పై దాడులు జరుగుతున్నాయని కూడా తెలుసూ. కానీ అమెరికాకు ఇవేవీ పట్టవు. దాని సొంత ప్రయోజనాలే అమెరికాకు ముఖ్యం.

America Pakistan: పాకిస్థాన్‌లో ఉగ్రవాదం పెరిగిందని అందరికీ తెలుసు.. భారత్‌పై దాడులు జరుగుతున్నాయని కూడా తెలుసూ. కానీ అమెరికాకు ఇవేవీ పట్టవు. దాని సొంత ప్రయోజనాలే అమెరికాకు ముఖ్యం. US ఆర్మీ డే సందర్భంగా పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు ప్రత్యేక ఆహ్వానం పంపడమే కాదు.. ఏకంగా పాక్‌పై పొగడ్తల వర్షం కురిపించింది. ఓవైపు ఉగ్రవాదంపై పోరాటం అంటూ మాటలు చెబుతూ.. మరోవైపు అదే ఉగ్రదేశానికి రక్షణ కవచంగా నిలబడడం అమెరికాకే చెల్లింది. ఇంతకీ అమెరికా ఎందుకిలా చేస్తోంది? పహల్గాం ఉగ్రదాడి లాంటి ఘటనల తర్వాత కూడా అమెరికా తీరు మారలేదా?

అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ జనరల్ కురిల్లా అడ్డదిడ్డంగా పాకిస్థాన్‌ను ప్రశంసించడమేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఉగ్రవాదానికి కేంద్రంగా మారిన దేశాన్ని కురిల్లా తెగ పొగిడేశారు. ఐసిస్ ఖోరాసాన్ ఉగ్రవాదుల్ని పట్టుకోవడంలో పాక్‌ కీలక పాత్ర పోషించిందని.. అమెరికా ఇచ్చిన ఇంటెలిజెన్స్ ఆధారంగా వారి నాయకులను అరెస్ట్ చేశారని చెబుతోంది. నిజానికి పాక్‌పై ప్రపంచవ్యాప్తంగా ఉగ్రదేశ ముద్ర ఉంది. అక్కడ ఉగ్రనేతలు ఆశ్రయం పొందుతున్నారన్న సమాచారమూ ఉంది. నిన్న మొన్నటి వరకు భారత్‌పై దాడులు చేసినవాళ్లు అక్కడే తలదాచుకుంటున్నారు. అలాంటి దేశాన్ని ఉగ్రవాదంపై పోరాటంలో భాగస్వామిగా అమెరికా అభివర్ణించడం యావత్‌ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసిందనే చెప్పాలి. అయితే అమెరికా ఇలా చేయడానికి చాలా కారణాలే కనిపిస్తున్నాయ్. ఇది అమెరికా కొత్త స్ట్రాటజీగా కనిపిస్తోంది. చైనాకు దగ్గరగా ఉంటున్న దేశాలను తిరిగి తనవైపు తిప్పుకోవడానికి అమెరికా ఈ గేమ్ ఆడుతోంది. పాక్‌ ఇప్పటికే చైనా వైపే కొనసాగుతోంది. బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుల్లో యాక్టీవ్‌గా ఉంది. ఇటు అఫ్ఘాన్ పరిసరాల్లో చైనా కొత్త ప్లాన్లు చేస్తోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే సంబంధిత దేశాలు తమకు దూరమవుతాయనే టెన్షన్‌లో అమెరికా ఉన్నట్టు కనిపిస్తోంది.

ఇక అమెరికా వ్యూహం వెనక కేవలం భద్రతా కారణాలే కాదు, భారీ ఆర్థిక ప్రయోజనాలూ ఉన్నాయి. డిఫెన్స్ డీల్స్, ఆర్థిక ఒప్పందాలతో పాటు అమెరికా మళ్లీ తన శక్తిని పెంచుకోవాలనే కోరిక ఈ నిర్ణయాల వెనక ఉంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌తో పాటు పాక్‌కు భారీగా పెట్టుబడులు పెడుతోంది. అమెరికా ఇదే ప్లాట్‌ఫామ్‌లో పోటీ పడాలని చూస్తోంది. అందుకే పాక్‌ను పూర్తిగా కోల్పోవడానికి ఇష్టపడటం లేదు. అంతేకాదు.. అఫ్ఘాన్‌ సరిహద్దు భూభాగాల్లో అమెరికా తమ ఇంటెలిజెన్స్, డిప్లొమసీ మళ్లీ బలపరచాలంటే, పాక్‌ను చేతిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఓ కమర్షియల్ ఫ్రెండ్‌షిప్‌. ఎవరితో డీల్ చేస్తే.. భవిష్యత్‌లో ప్రయోజనం ఉంటుందో వారితోనే అమెరికా నడుస్తోంది. అందుకే పాక్‌ను మళ్లీ తనవైపుకు తిప్పుకుంటోంది. అయితే ఇక్కడే అమెరికా అసలు వైఖరి బయటపడుతోంది. ఉగ్రవాదంపై అమెరికా చెప్పే మాటలూ, తీసుకునే చర్యలూ అసలు పొంతనలేవు. మాటల పరంగా తీవ్రంగా షో ఆఫ్‌ చేసే అమెరికా.. అదే దేశానికి మద్దతు ఇస్తూ, ప్రశంసలు కురిపించడమేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. అటు పహల్గాం ఘటన మాత్రమే కాదు.. గతంలోనూ ఇండియాపై పాక్‌ ఎన్నో దాడులు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories