American Airlines: విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో మంటలు.. భయాందోళనలో ప్రయాణికులు

American Airlines Plane Engine Fire Las Vegas Emergency Landing
x

American Airlines: విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో మంటలు.. భయాందోళనలో ప్రయాణికులు

Highlights

గగనతలంలో ప్రయాణిస్తుండగా విమానం ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా మంటలు, పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Flight: అమెరికాలో ఓ విమాన ప్రయాణం భయానక అనుభూతిని మిగిల్చింది. లాస్‌వేగాస్‌ ఎయిర్‌పోర్టు నుంచి నార్త్‌ కరోలినాలోని ఛార్లొట్‌కు బయల్దేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో టేకాఫ్‌ అయిన కొద్ది నిమిషాల్లోనే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన బుధవారం ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం) 8:11 గంటలకు చోటు చేసుకుంది.

గగనతలంలో ప్రయాణిస్తుండగా విమానం ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా మంటలు, పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పరిస్థితిని వెంటనే గమనించిన పైలట్లు అప్రమత్తమై విమానాన్ని తిరిగి లాస్‌వేగాస్ ఎయిర్‌పోర్టు వైపు మళ్లించారు. ఉదయం 8:20 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ విమానంలో 153 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బంది ఉన్నారు. సకాలంలో పైలట్ తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అయితే, ల్యాండింగ్ తర్వాత ఎయిర్‌లైన్ మెకానిక్స్ నిర్వహించిన తనిఖీలో ఇంజిన్‌ నుంచి మంటలు వచ్చిందన్న స్పష్టమైన ఆధారాలు లభించలేదని వెల్లడించారు. ఈ ఘటనతో ప్రయాణికులు మాత్రం గడచిన క్షణాలను మరువలేని అనుభూతిగా గుర్తించుకున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories