Atheists: ప్రపంచంలో పెరుగుతోన్న నాస్తికుల సంఖ్య..ప్యూ రీసెర్చ్ సంచలన విషయాలు..!

Atheists
x

Atheists: ప్రపంచంలో పెరుగుతోన్న నాస్తికుల సంఖ్య..ప్యూ రీసెర్చ్ సంచలన విషయాలు..!

Highlights

Atheists: ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా తమ జనాభాను పెంచుకుంటున్న మతమేంటో తెలుసా? ఇస్లాం.. మరి ఆ తర్వాత ఫాస్టెస్ట్‌ గ్రోయింగ్‌ రీలిజియన్‌ ఏంటో తెలుసా? క్రీస్టియానిటీ..మరో మూడో ప్లేస్‌లో ఏముందనుకుంటున్నారు? ఎక్కువగా థింక్ చేయకండి.. మూడో ప్లేస్‌లో అసలు మతమే లేదట.. అవును.. ఏ మతాన్ని విశ్వసించని నాస్తికుల సంఖ్య వేగంగా పెరుగుతోందని ప్యూ రీసెర్చ్ సెంటర్ తేల్చేసింది.

నిజానికి ప్రతీ ఒక్కరూ ఏదో ఒక మతాన్ని పాటించాలని రూలేమీ లేదు.. కొన్ని దేశాల్లో అసలు మతమే ఉండదు.. అయితే చాలా దేశాల్లో మాత్రం మతాలే ప్రజలను ఏలుతుంటాయ్..! ఇక ప్యూ రీసెర్చ్ సెంటర్ లెక్కల ప్రకారం.. 2010 నుంచి 2020 వరకు.. అంటే 10 సంవత్సరాల్లో ముస్లింల సంఖ్య 34.7 కోట్ల మేర పెరిగింది. ఇది ఇతర మతాలతో పోలిస్తే చాలా ఎక్కువ. ఇదే సమయంలో క్రీస్టియన్ల సంఖ్య 12.2 కోట్లు మాత్రమే పెరిగింది.

యూరప్‌, నార్త్‌ అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లోని చాలామంది క్రీస్టియన్లు నాస్తికులగా మారుతున్నారని ఈ నివేదికలలో స్పష్టంగా రాసి ఉంది. ఇటు హిందువుల సంఖ్య 2010తో పోల్చితే కాస్త తగ్గిందని ప్యూ రీసెర్చ్ సెంటర్‌ లెక్కలు స్పష్టం చేస్తున్నాయ్.. ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల మందికిపైగా హిందువులు ఉన్నారు.

ఇది మిగిలిన మతాల వాటాలో 14.9శాతంగా ఉంది. అయితే 2010లో ఈ శాతం 15కు పైగా ఉండేది. ఇక ఓవరాల్‌గా ప్రపంచంలోనే భారీ మెజార్టీ ఉన్న మతంగా మరోసారి క్రీస్టియానిటినే నిలిచింది. అయితే ఇక్కడ ఓ విషయాన్ని ఈ నివేదిక హైలెట్ చేస్తోంది. అతిపెద్ద సముహంగా క్రీస్టియన్లు ఉన్నా.. వారిలో చాలా మంది మతాన్ని వీడుతుండడం కారణంగా ఇస్లాం అన్నిటికంటే వేగంగా తన జనాభాను పెంచుకుంటున్న మతంగా టాప్‌లో నిలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories