Iran vs America: ఇరాన్‌పై ఆ బాంబుతో దాడి చేసేందుకు అమెరికా రెడీ? నెక్ట్స్‌ జరిగేది ఇదే!

Iran vs America
x

Iran vs America: ఇరాన్‌పై ఆ బాంబుతో దాడి చేసేందుకు అమెరికా రెడీ? నెక్ట్స్‌ జరిగేది ఇదే!

Highlights

Iran vs America: ఇది కేవలం బాంబర్ల ప్రయాణం కాదు.. ఇది ఒక యుద్ధం దిశగా కదులుతున్న మారణహోమానికి బీజం!

Iran vs America: అమెరికా తన యుద్ధ మేఘాల్ని కదిలించింది. సముద్రాన్ని చీల్చే నౌకలు, వాటిపై ఉన్న అలల్ని భీకరంగా ఉక్కిరిబిక్కిరి చేసే యుద్ధవిమానాలు, మౌనం లోతుల్లో నుంచి లేచిన స్టెల్త్ బాంబర్లు..! ఇలా అమెరికా ఆయుధాలన్నీ ఒకే వైపుగా సాగుతున్నాయి. వారి లక్ష్యం ఒక్కటే.. అదే ఇరాన్..! అటు ఇరాన్ కూడా కాపుకాచుకోని ఎదురు చూస్తోంది. భూగర్భాల్లో క్షిపణులను పైకి తీసుకొస్తోంది. శబ్దం వినిపించకపోయినా.. శత్రువు శ్వాస తీసే ధైర్యాన్ని చూపిస్తోంది. ఇలా ప్రపంచం మరో యుద్ధానికి రెడీ అవుతోంది. అమెరికా వర్సెస్‌ ఇరాన్‌ వార్‌కు సమయం దగ్గరపడినట్టే కనిపిస్తోంది. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం.. బీ-2 బాంబర్లు!

ఈ బీ-2 బాంబర్ల అసలు కథ దీగో గార్సియా దీవిలో మొదలవుతుంది. ఇది హిందూ మహాసముద్రంలో బ్రిటన్‌కు చెందిన ఓ స్ట్రాటజిక్ మిలిటరీ బేస్. అమెరికా అక్కడే బీ-2 స్టెల్త్ బాంబర్లను పెద్ద ఎత్తున మోహరించింది. ట్రాన్స్‌పోర్ట్ ఏరుక్రాఫ్ట్‌లు కూడా అదే బేస్‌ చుట్టూ తిరుగుతున్నాయి. దీన్ని చూసిన ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే.. దీగో గార్సియా నుంచి ఇరాన్ 4800 కిలోమీటర్లు దూరంలోనే ఉంటుంది. అందుకే ఇరాన్ కోపంతో ఊగిపోతోంది. ఎందుకంటే ఈ స్థాయిలో బీ-2 బాంబర్ల మోహరింపు అనేది కేవలం హెచ్చరిక కాదు.. ఇరాన్‌పై అమెరికా నేరుగా దాడికి సిద్ధమవుతుందని చెప్పడానికి సంకేతం.

అయితే అమెరికా చర్యలకు ఇరాన్‌ భయపడడంలేదు.. బ్రిటన్ అయినా, అమెరికా అయినా తము తేడా లేదని... ఏ బెస్‌ క్యాంప్‌ నుంచి బాంబు పడితే.. ఆ క్యాంప్‌ అంతుచూస్తామని ఘాటుగా రియాక్ట్ అయ్యింది. ఇరాన్‌ ఈ రేంజ్‌లో రిప్లై ఇవ్వడానికి పెద్ద కారణమే కనిపిస్తోంది. బీ-2 బాంబర్లు సాధారణమైన యుద్ధవిమానాలు కాదు. ఇవి అమెరికా చేతిలో ఉన్న అత్యంత రహస్యమైన వాయుసేన ఆయుధాలు. రాడార్‌కు దూరంగా ఉండే ఈ విమానాలను శత్రువు కనిపెట్టలేడు. ఎందుకంటే ఇవి చాలా డార్క్‌గా ఉంటాయి. గాలిలో ఎగిరినా దాని ఉనికి కనిపించదు. శబ్దం వినిపించదు.. కానీ దాని ప్రభావం మాత్రం లక్ష్యాన్ని వణికించేలా ఉంటుంది. ఒకే సమయంలో అణుబాంబులు, డీప్ పెనెట్రేటింగ్ బాంబులను మోసుకుపోయే సామర్థ్యం వీటికి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories