Baba Vanga 2026 Predictions: ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం? ఆ భయంకరమైన అంచనాలు నిజమవుతున్నాయా!

Baba Vanga 2026 Predictions: ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం? ఆ భయంకరమైన అంచనాలు నిజమవుతున్నాయా!
x
Highlights

బాబా వంగా 2026 అంచనాలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయా? అమెరికా, రష్యా, చైనా మధ్య నెలకొన్న తాజా ఉద్రిక్తతలు మరియు బాబా వంగా జోస్యంపై పూర్తి కథనం ఇక్కడ.

ప్రపంచం ఇప్పుడు ఒక అనిశ్చితిలో ఉంది. 2026 ప్రారంభం నుంచే జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే మానవాళికి మరో గండం పొంచి ఉందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా బల్గేరియాకు చెందిన అంధురాలైన ప్రవక్త బాబా వంగా చెప్పిన అంచనాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టిస్తున్నాయి.

నిజమవుతున్న అంచనాలు!

గతంలో 9/11 దాడులు, కోవిడ్-19 మహమ్మారి వంటి సంఘటనలను ముందే ఊహించిన బాబా వంగా.. 2026వ సంవత్సరం అత్యంత విధ్వంసకరంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ ఏడాది మూడో ప్రపంచ యుద్ధం (World War 3) మొదలయ్యే అవకాశం ఉందన్న ఆమె మాటలు, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులతో సరిపోలుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఇవేనా?

ప్రస్తుతం ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు బాబా వంగా అంచనాలకు బలం చేకూరుస్తున్నాయి:

అమెరికా దూకుడు: వెనెజువెలాపై అమెరికా సైనిక చర్యలు, రష్యా చమురు నౌకలపై దాడులు పరిస్థితిని క్లిష్టతరం చేస్తున్నాయి.

యూరప్ & గ్రీన్‌లాండ్: గ్రీన్‌లాండ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు యూరోపియన్ దేశాలతో విబేధాలకు దారితీస్తున్నాయి.

ఆసియాలో సెగలు: తైవాన్‌పై చైనా కన్ను వేయడం, ఇరాన్‌లో అంతర్గత తిరుగుబాట్లు మరిన్ని కుదుపులకు కారణమవుతున్నాయి.

రష్యా - ఉక్రెయిన్: ఏళ్ల తరబడి సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది.

విధ్వంసం తప్పదా?

లాటిన్ అమెరికా నుంచి యూరప్ వరకు సాగుతున్న చమురు రాజకీయాలు, వాణిజ్య యుద్ధాలు ప్రపంచాన్ని యుద్ధం వైపు నెడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. బాబా వంగా జోస్యం ప్రకారం.. 2026లో ప్రకృతి వైపరీత్యాలతో పాటు భారీ సైనిక ఘర్షణలు జరిగే అవకాశం ఉంది. మరి ఈ పరిస్థితులు శాంతి వైపు వెళ్తాయా లేదా బాబా వంగా చెప్పినట్టుగా సర్వనాశనానికి దారితీస్తాయా అనేది కాలమే నిర్ణయించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories