Bangkok Shooting: బ్యాంకాక్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురి మృతి

Bangkok Shooting
x

Bangkok Shooting: బ్యాంకాక్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురి మృతి

Highlights

Bangkok Shooting: థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లోని ఓర్ టు కో మార్కెట్‌లో మంగళవారం ఉదయం తీవ్ర కలకలం చోటుచేసుకుంది.

Bangkok Shooting: థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లోని ఓర్ టు కో మార్కెట్‌లో మంగళవారం ఉదయం తీవ్ర కలకలం చోటుచేసుకుంది. ఓ దుండగుడు అర్ధరాత్రి కాల్పులకు తెగబడిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, అనంతరం దుండగుడు తనను తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటన పట్ల స్థానికులు, పర్యాటకుల్లో భయాందోళనలు వెల్లివిరిశాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దుండగుడు మార్కెట్‌ ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించి, అక్కడ విధులు నిర్వర్తిస్తున్న నలుగురు సెక్యూరిటీ గార్డులు, ఓ మహిళపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అనంతరం అతడు తానూ తానే తుపాకీతో కాల్చుకుని మృతిచెందాడు.

ప్రముఖ పర్యాటక ప్రదేశమైన చతుచక్ మార్కెట్‌కు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు అక్కడికి చేరుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. సంఘటనాస్థలాన్ని ముట్టడి చేసి, కేసును విచారిస్తున్నారు. కాల్పులకు గల ఉద్దేశ్యాన్ని మరియు దుండగుడి ప్రవర్తన వెనుకున్న కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనకు థాయ్‌లాండ్‌-కంబోడియా సరిహద్దుల వద్ద ఇటీవల నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధముందా? అన్న కోణంలోనూ అధికారులు విచారణ చేపట్టారు. గత కొన్ని నెలలుగా థాయ్‌లాండ్‌లో ఇటువంటి కాల్పుల ఘటనలు పెరిగిపోతున్నట్లు సమాచారం. గత మే నెలలో థాంగ్ జిల్లాలో ఓ పాఠశాల సమీపంలో చోటుచేసుకున్న కాల్పుల్లో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే.

పోలీసులు ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం కోసం సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం సహాయాన్ని అందిస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories