Bangladesh Crisis: బంగ్లాదేశ్‌లో మరో విద్యార్థి నేతపై కాల్పులు

Bangladesh Crisis: బంగ్లాదేశ్‌లో మరో విద్యార్థి నేతపై కాల్పులు
x
Highlights

Mohammad Motaleb Sikder: బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత రోజురోజుకూ ముదురుతోంది.

Mohammad Motaleb Sikder: బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత రోజురోజుకూ ముదురుతోంది. ప్రముఖ విద్యార్థి నేత ఉస్మాన్ హాదీ హత్యోదంతం మరువక ముందే, అదే పార్టీకి చెందిన మరో కీలక నాయకుడిపై హత్యాయత్నం జరగడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సోమవారం ఉదయం ఖుల్నా నగరంలో నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) నేత మహమ్మద్ మొతాలెబ్ షిక్దర్‌పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు.

తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్

స్థానిక మీడియా సమాచారం ప్రకారం.. ఉదయం 11:45 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు షిక్దర్‌ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బుల్లెట్ ఆయన తలలోకి దూసుకెళ్లింది. తీవ్ర రక్తస్రావమైన ఆయన్ను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని, వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారని దర్యాప్తు అధికారి అనిమేష్ మోండల్ వెల్లడించారు.

వరుస దాడులతో వణుకుతున్న నేతలు

గత వారం (డిసెంబర్ 12న) ఢాకాలో ఎన్‌సీపీకే చెందిన ప్రముఖ నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ దారుణ హత్యకు గురయ్యారు.

హాదీ నేపథ్యం: మాజీ ప్రధాని షేక్ హసీనాను గద్దె దించడానికి కారణమైన విద్యార్థి ఉద్యమంలో హాదీ కీలక పాత్ర పోషించారు. భారత వ్యతిరేక వ్యాఖ్యలతో ఆయన తరచుగా వార్తల్లో నిలిచారు.

హింస: హాదీ మరణం తర్వాత బంగ్లాదేశ్‌లో నిరసనలు మిన్నంటాయి. ఈ క్రమంలోనే మైనారిటీలపై దాడులు పెరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.

ఎన్నికల వేళ రాజకీయ కుట్ర?

గతేడాది జరిగిన భారీ విద్యార్థి నిరసనల ఫలితంగా 'నేషనల్ సిటిజన్ పార్టీ' (NCP) ఆవిర్భవించింది. 2026 ఫిబ్రవరిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీ పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలోని కీలక నేతలను వరుసగా లక్ష్యంగా చేసుకోవడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందని ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories