Bering Air Flight: అమెరికాలో విమానం మిస్సింగ్.. కొనసాగుతున్న గాలింపు

Bering Air Flight Carrying 10 People Goes Missing Over Alaska
x

Bering Air Flight: అమెరికాలో విమానం మిస్సింగ్.. కొనసాగుతున్న గాలింపు

Highlights

Bering Air Flight: అమెరికా అలస్కాలో శుక్రవారం విమానం మిస్సైంది. ఈ విమానంలో పైలట్ సహా తొమ్మిది మంది ప్రయాణీకులున్నారు.

Bering Air Flight: అమెరికా అలస్కాలో గురువారం మధ్యాహ్నం విమానం మిస్సైంది. ఈ విమానంలో పైలట్ సహా తొమ్మిది మంది ప్రయాణీకులున్నారు. అమెరికా టైమ్ ప్రకారం గురువారం నాలుగు గంటల సమయంలో ఉనల్కలేట్ నుంచి నోమ్ వెళ్లున్న విమానం అదృశ్యమైంది. అదృశ్యమైన ఫ్లైట్ సెస్నా 208 బీ గ్రాండ్ కారవాన్ మోడల్ కు చెందింది.నార్టోన్ సౌండ్ ఏరియాలో ఈ విమానం కన్పించకుండా పోయింది. టేకాఫ్ అయిన 50 నిమిషాల తర్వాత రాడార్‌ సిగ్నల్స్ కు దూరంగా విమానం వెళ్లింది. విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టాయి.

విమానం అదృశ్యమయ్యే ముందు పైలట్ ఆంకరేజ్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు హోల్డింగ్ ప్యాటర్న్‌లోకి ప్రవేశించే విషయమై మాట్లాడారు.నోమ్ వద్ద రన్ వే క్లియరెన్స్ కోసం ఆయన ఏటీసీతో మాట్లాడారు. అదృశ్యమైన విమానం కోసం గాలిస్తున్నామని నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఎన్ టీ ఎస్ బీ తెలిపింది. పరిస్థితిని సమీక్షిస్తున్నామని ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎప్ఏఏ దీనిపై వెంటనే స్పందించేందుకు నిరాకరించింది.

ఈ ఏడాది జనవరి 29నవాషింగ్టన్ డీసీలో ఫ్లైట్, హెలికాప్టర్ గాల్లోనే ఢీకున్నాయి. ఈ ఘటనలో 40 మృతదేహలను రికవరీ చేశారు. విమానంలో 60 మంది ప్యాసింజర్లున్నారు. హెలికాప్టర్లో నలుగురున్నారు. జనవరి 31న పెన్సెల్వేనియాలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు మరణించారు. 24 మంది గాయపడ్డారు.




Show Full Article
Print Article
Next Story
More Stories