కాలిఫోర్నియా: ‘ఆ లేడీ సెనేటర్ నన్ను సెక్స్ బానిసగా వాడుకున్నారు..’ - ఫిర్యాదు చేసిన బాధితుడు

California State Senator Used Her Male Staffer As Sex Slave Lawsuit Filed
x

కాలిఫోర్నియా: ‘ఆ లేడీ సెనేటర్ నన్ను సెక్స్ బానిసగా వాడుకున్నారు..’ - ఫిర్యాదు చేసిన బాధితుడు

Highlights

కాలిఫోర్నియా సెనెటర్ గా 2022 లో ఎన్నికైన తర్వాత తనను చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా నియమించుకున్నట్టు గా బాధితుడు ఆ పిటిషన్ లో చెప్పారు.

కాలిఫోర్నియా సెనెటర్ మేరీ అల్వరాడో గిల్ తనను సెక్స్ బానిసగా ఉపయోగించుకున్నారని ఆమె వద్ద పని చేసిన ఉద్యోగి ఒకరు ఆరోపించారు. ఆమె తనను లైంగికంగా వేధించారని శాక్రామెంటో కౌంటీ సుపీరియర్ కోర్టులో కేసు వేశారు. తనకు న్యాయం కావాలని కోరుతున్నారు.

కాలిఫోర్నియా సెనెటర్ గా 2022 లో ఎన్నికైన తర్వాత తనను చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా నియమించుకున్నట్టు గా బాధితుడు ఆ పిటిషన్ లో చెప్పారు. విధుల్లో చేరిన కొంతకాలానికే ఆమె తనతో వ్యక్తిగత విషయాలను పంచుకున్నారని చెప్పారు.

ఆ తర్వాత తనతో ఆమె ఏకాంతంగా గడిపారన్నారు. కొన్ని సమయాల్లో ఆమె అసహజ శృంగారం కోసం డిమాండ్ చేయడం మొదలు పెట్టారని తెలిపారు. దాని వల్ల తనకు అనారోగ్య సమస్యలు వచ్చాయన్నారు. ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసం ఈ విషయాన్ని ఇన్నాళ్ళూ బయటపెట్టలేదని అన్నారు.

శాంటాక్లాజ్ కాస్ట్యూమ్స్ వేసుకోలేదన్న కారణంగా గత ఏడాది డిసెంబర్ లో విధుల నుంచి తప్పించారని బాధితుడు తన ఫిర్యాదులో ఆరోపించారు. తనకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని ఆయన కోరారు. అయితే, ఈ ఆరోపణలను సెనేటర్ కొట్టిపారేశారు. తన నుంచి డబ్బులు లాగేందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories