చైనా ఉత్పత్తులే కాదు... చైనా కంపెనీ కట్టిన బిల్డింగ్స్ కూడా అంతేనా?

China construction company behind Bangkok Skyscraper that collapsed after myanmar earthquake hits Bangkok
x

చైనా ఉత్పత్తులే కాదు... చైనా కట్టిన బిల్డింగ్స్ కూడా అంతేనా? కూలిన 33 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణంలో చైనా కంపెనీ పాత్రపై ఆరా తీస్తోన్న అధికారులు

Highlights

బ్యాంకాక్‌లో భూకంపం ధాటికి 33 అంతస్తుల బిల్డింగ్ కూలిన ఘటనలో 17 మంది మృతి చెందారు. భవనం శిథిలాల కింద చిక్కుకున్న పదుల సంఖ్యలో జనం పరిస్థితి ఏంటో ఇంకా...

బ్యాంకాక్‌లో భూకంపం ధాటికి 33 అంతస్తుల బిల్డింగ్ కూలిన ఘటనలో 17 మంది మృతి చెందారు. భవనం శిథిలాల కింద చిక్కుకున్న పదుల సంఖ్యలో జనం పరిస్థితి ఏంటో ఇంకా తెలియదు. ఘటన జరిగి 48 గంటలు దాటింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఎవరైనా ప్రాణాలతో ఉండి ఉంటారేమోననే ఆశతో రెస్క్యూ టీమ్ తమ సహాయ చర్యలు కొనసాగిస్తోంది.

బ్యాంకాక్ లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భారీ కట్టడాలు చాలానే ఉన్నాయి. అందులో భారీ అంతస్తుల కట్టడాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ అవేవి పెద్దగా తినలేదు. కానీ ఈ 33 అంతస్తుల భవనం మాత్రం 5 సెకన్లలో కుప్పకూలి శిథిలాల గుట్టగా మిగిలింది. ఎంతోమందిని పొట్టనపెట్టుకుంది. ఈ ఘటన తరువాత కనిపించకుండా పోయిన వారంతా ఆ శిథిలాల కిందే చిక్కుకుని ఉండి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, వేరే భవనాలకు ఏమీ కాకుండా ఈ భవనం మాత్రమే కూలిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా భవన నిర్మాణంలో నాణ్యత లోపించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లే ఈ భవనం కూలిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదే విషయమై థాయ్‌లాండ్ ఉప ప్రధాని అనుతిన్ చర్నవిరకుల్ ఈ భవనం కూలిపోవడానికి గల కారణాలు ఏంటె తెలుసుకోవాల్సిందిగా విచారణకు ఆదేశించారు. దీంతో సంబంధిత అధికారులు ఈ భవనం కూలిపోవడానికి దారితీసిన పరిస్థితులు, కారణాలను వెలికితీసే పనిలో పడ్డారు.

థాయ్‌లాండ్ స్టేట్ ఆడిట్ ఆఫీస్‌కు చెందిన ఈ 33 అంతస్తుల భవనం గత మూడేళ్లుగా నిర్మాణంలో ఉంది. ఇంకొన్ని రోజుల్లో పనులు పూర్తి కావాల్సి ఉంది. 200 కోట్ల బాత్‌ల నిధులతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే రూ. 500 కోట్లు అవుతుంది.

చైనా కంపెనీ పాత్రపై అనుమానాలు

బ్రిటన్ టెలిగ్రాఫ్ కథనం ప్రకారం ఈ భవనాన్ని రెండు కంపెనీలు కలిసి నిర్మించాయి. ఈ జాయింట్ వెంచర్ లో ఉన్న రెండు కంపెనీల్లో ఒకటి ఇటాలియన్-థాయ్ డెవలప్మెంట్ పీఎల్‌సి (ITD) కాగా మరొకటి చైనా రైల్వే నెంబర్ 10 లిమిటెడ్ (థాయ్‌లాండ్). చైనా రైల్వే నెంబర్ 10 లిమిటెడ్ అనేది చైనా రైల్వే నెంబర్ 10 ఇంజనీరింగ్ గ్రూప్ కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ. ఈ కంపెనీకి ఈ భవనం నిర్మాణంలో 49 శాతం వాటా ఉంది. థాయ్‌లాండ్ రూల్స్ ప్రకారం బయటి దేశం కంపెనీలకు 49% కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి వీల్లేదు.అలా ఆ చైనా కంపెనీ బ్యాంకాక్ లో నిర్మిస్తున్న ఈ భవన నిర్మాణం టెండర్లో 49 శాతం గుత్తేదారుగా ఉంది.

భవనం నిర్మిస్తున్న తీరు, వేగం, కొన్ని మెటీరియల్స్ లేకుండానే పనులు కొనసాగిస్తుండటం వంటి అంశాలను ఇంజనీర్స్ ఆందోళన వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆ బిల్డింగ్ నిర్మాణం చేస్తోన్న జాయింట్ వెంచర్ కంపెనీలు అదేమి పట్టించుకోకుండా పనులు పూర్తిచేసేందుకే మొగ్గు చూపినట్లు బ్యాంకాక్ మీడియాలో వార్తలొస్తున్నాయి.

ప్రత్యక్షసాక్షులు చెబుతున్న వివరాల ప్రకారం బిల్డింగ్ కూలిపోయేటప్పుడు పెద్ద పెద్దగా కాంక్రిట్ పలుగుళ్ల శబ్ధం వచ్చినట్లు తెలుస్తోంది. ఇదంతా చూస్తోంటే, నాణ్యతలో లోపం వల్లే బిల్డింగ్ కూలిపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే మిగతా భవనాలు భూకంపాన్ని తట్టుకుని నిలబడినప్పటికీ ఈ భవనం మాత్రం 5 సెకన్లలో కుప్పకూలిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories