భారత్‌ని టార్గెట్ చేస్తోన్న చైనా.. పాక్, బంగ్లాదేశ్‌తో చర్చలు

భారత్‌ని టార్గెట్ చేస్తోన్న చైనా.. పాక్, బంగ్లాదేశ్‌తో చర్చలు
x

భారత్‌ని టార్గెట్ చేస్తోన్న చైనా.. పాక్, బంగ్లాదేశ్‌తో చర్చలు

Highlights

పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో కలిసి చైనా భారత్‌ని టార్గెట్ చేసే ప్లాన్ వేస్తోంది. ఇటీవల ఆ మూడు దేశాలు త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించాయి. చైనా చరిత్రలో తొలిసారిగా బంగ్లాదేశ్, పాక్‌తో కలిసి ఇలా సమావేశం నిర్వహించింది.

పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో కలిసి చైనా భారత్‌ని టార్గెట్ చేసే ప్లాన్ వేస్తోంది. ఇటీవల ఆ మూడు దేశాలు త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించాయి. చైనా చరిత్రలో తొలిసారిగా బంగ్లాదేశ్, పాక్‌తో కలిసి ఇలా సమావేశం నిర్వహించింది. అయితే ఈ సమావేశంలో భారత్‌ని చుట్టుముట్టే ప్లాన్స్ పైనే ఈ మూడు దేశాలు చర్చించుకున్నాయని భారత్ ఆలోచిస్తుంది.

కర్నింగ్ ప్లాన్లు వేయడంలో చైనాకు చైనాయే సాటి. దానికితోడు ఇప్పుడు పాక్, మరోపక్క బంగ్లాదేశ్. ఇక ఈ మూడు కలిస్తే ఆలోచించేది ఏముంటుంది? భారతదేశాన్ని ఎలా చుట్టుముట్టాలా అన్నది తప్ప. ఇప్పుడు ఈ మూడు దేశాలు త్రైపాక్షిక చర్చలు జరపడంతో భారత్ ఇప్పుడు అదే అనుకుంటుంది.

చైనా, పాక్ మనకు ఎప్పుడూ శత్రువులే. కానీ బంగ్లాదేశ్ షేక్ హసీనా అదికారంలో ఉన్న సమయంలో భారత్‌కు అనుకూలంటా బంగ్లాదేశ్ ఉండేది. ఎప్పుడైతే మహ్మద్ యూన్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి భారత్‌కు వ్యతిరేకం అయిపోయింది. దీనికితోడు పక్కనే ఉన్న పాక్, చైనాలు తోడై.. బంగ్లాదేశ్‌ను భారత్‌పైకి ఉసుగొల్పుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం, ఈ త్రైపాక్షిక సమావేశంలో చైనా ఉప విదేశాంగ మంత్రి సన్ వీడాంగ్, బంగ్లాదేశ్ తాత్కాలిక విదేశాంగ కార్యదర్శి రుహుల్ అలం సిద్దిఖీ, పాక్ అదనపు విదేశాంగ కార్యదర్శి ఇమ్రాన్‌లు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో చైనా .. దక్షిణాసియా దేశాలతో బలమైన సంబంధాలు పెంచుకోవాలని చూస్తుందని, అలాగే పాక్, బంగ్లాదేశ్ నుంచి కూడా పలు రంగాల్లో సహాకారం కావాలని కోరినట్లు సమాచారం. అయితే మూడు గుంట నక్కలు ఒకో చోట కలిస్తే అక్కడ మంచి ఆలోచనలు ఉండవు కదా. భారత్ పైన కూడా ఏదో చెడు ఆలోచనలు కూడా ఈ సమావేశంలో ఈ మూడు దేశాలు చేసే ఉంటాయని భారత్ ఆలోచిస్తుంది. అయితే, భారత్ ఇప్పడు అన్ని రంగాల్లో బలంగా ఉంది. మన దేశాన్ని ఎదుర్కోవడం ఇప్పుడు అంత ఈజీ కాదు కూడా.

Show Full Article
Print Article
Next Story
More Stories