China Monkey Shortage: కోతి ధర రూ. 25 లక్షలు.. చైనాలో వింత పరిస్థితి! మందుల తయారీపై 'కొరత' దెబ్బ

China Monkey Shortage
x

China Monkey Shortage: కోతి ధర రూ. 25 లక్షలు.. చైనాలో వింత పరిస్థితి! మందుల తయారీపై 'కొరత' దెబ్బ

Highlights

China Monkey Shortage: ఒక్కో కోతి ధర రూ. 25 లక్షలు! చైనాలో కోతులకు ఎందుకంత డిమాండ్? మందుల తయారీ, క్లినికల్ ట్రయల్స్‌పై కోతుల కొరత ప్రభావం.

China Monkey Shortage: చైనాలో ప్రస్తుతం కోతుల ధరలు వింటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. అక్కడ ఒక్కో కోతి విలువ దాదాపు రూ. 25 లక్షల (1.93 లక్షల యువాన్లు)కు చేరుకుంది. అడవుల్లో కోతులు కోకొల్లలుగా ఉన్నప్పటికీ, ప్రయోగశాలల్లో పరిశోధనలకు అవసరమైన కోతుల కొరత తీవ్రంగా ఏర్పడటమే దీనికి ప్రధాన కారణం.

ప్రయోగాలకు 'సెకండ్ జనరేషన్' కోతులే కీలకం: సాధారణంగా కొత్త ఔషధాల తయారీలో క్లినికల్ ట్రయల్స్ కోసం కోతులను ఉపయోగిస్తారు. అయితే ఈ ప్రక్రియలో కొన్ని కఠిన నిబంధనలు ఉన్నాయి:

చట్ట వ్యతిరేకం: అడవుల నుంచి నేరుగా పట్టితెచ్చిన కోతులను ప్రయోగాలకు వాడటం చట్టరీత్యా నేరం.

వ్యాధుల ముప్పు: అడవి కోతులకు రకరకాల ఇన్ఫెక్షన్లు ఉండే అవకాశం ఉంటుంది, దీనివల్ల ప్రయోగ ఫలితాల్లో ఖచ్చితత్వం ఉండదు.

బ్రీడింగ్ కేంద్రాలు: అడవి నుంచి తెచ్చిన కోతులను బ్రీడింగ్ కేంద్రాల్లో పెంచి, వాటికి పుట్టిన రెండో తరం (Second Generation) కోతులను మాత్రమే ల్యాబ్ ప్రయోగాలకు వినియోగిస్తారు.

డిమాండ్ పెరగడానికి కారణాలివే: ఒక కోతి పుట్టి, పెరిగి ప్రయోగాలకు సిద్ధం కావడానికి కనీసం నాలుగేళ్ల సమయం పడుతుంది. ప్రస్తుతం చైనాలో కొత్త ఔషధాల తయారీ విపరీతంగా పెరగడంతో.. ఆ స్థాయికి తగ్గట్లుగా కోతుల సరఫరా జరగడం లేదు.

ధరల పెరుగుదల: ఈ ఏడాది ప్రారంభంలో రూ. 13 లక్షలుగా ఉన్న కోతి ధర, డిమాండ్ పెరగడంతో ఇప్పుడు ఏకంగా రూ. 25 లక్షలకు చేరింది.

పరిశోధనలపై ప్రభావం: కోతుల ధరలు పెరగడంతో మందుల తయారీ ఖర్చు భారమవుతోందని, కొత్త ప్రయోగాలు ఆలస్యమవుతున్నాయని చైనా పరిశోధనా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

కరోనా సమయంలోనూ ఇలాగే ధరలు పెరిగినప్పటికీ, ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. కానీ ఇప్పుడు మళ్లీ రికార్డు స్థాయికి చేరడం అంతర్జాతీయ ఔషధ రంగాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories