Birth Rate: జనాభా పెంచేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ.. పిల్లలు పుడితే రూ.1.2లక్షల సాయం

Birth Rate
x

Birth Rate: జనాభా పెంచేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ.. పిల్లలు పుడితే రూ.1.2లక్షల సాయం

Highlights

Birth Rate: చైనా ప్రభుత్వం తమ దేశంలో తగ్గుతున్న జననాల రేటును పెంచడానికి, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. 2025 జనవరి 1వ తేదీ తర్వాత పుట్టే ప్రతి బిడ్డ తల్లిదండ్రులకు రూ.1.2 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది.

Birth Rate: చైనా ప్రభుత్వం తమ దేశంలో తగ్గుతున్న జననాల రేటును పెంచడానికి, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. 2025 జనవరి 1వ తేదీ తర్వాత పుట్టే ప్రతి బిడ్డ తల్లిదండ్రులకు రూ.1.2 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. ఈ మొత్తం బిడ్డకు మూడేళ్లు నిండే వరకు, అంటే సంవత్సరానికి దాదాపు రూ.42 వేలు లభిస్తుంది. దేశ వర్క్‌ఫోర్స్‌ను పెంచడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.. ఎందుకంటే చైనా ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా శ్రామిక శక్తిపైనే ఆధారపడి ఉంది.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. చైనా జనాభా వరుసగా మూడో సంవత్సరమూ తగ్గుతోంది. గత సంవత్సరం కేవలం 95.4 లక్షల మంది పిల్లలు మాత్రమే జన్మించారు. ఇది 2016లో వన్-చైల్డ్ పాలసీని రద్దు చేసినప్పటి సంఖ్యలో దాదాపు సగం. ఒక దశాబ్దం క్రితమే చైనా వన్-చైల్డ్ పాలసీని రద్దు చేసినా, ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనడానికి ఆసక్తి చూపడం లేదు. పెళ్లిళ్ల రేటు కూడా గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తగ్గిపోయింది. దీంతో రాబోయే సంవత్సరాల్లో జననాల రేటు మరింత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి స్థానిక ప్రభుత్వాలు ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇన్నర్ మంగోలియాలోని హోహోట్ నగరంలో రెండో బిడ్డకు 50,000 యువాన్లు (సుమారు రూ. లక్షలు), మూడో బిడ్డకు 1,00,000 యువాన్లు (సుమారు రూ.12 లక్షలు) ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రజల ఆదాయం తక్కువగా ఉండటంతో ఈ మొత్తం వారికి చాలా ముఖ్యం అని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది.

కేవలం డబ్బుతో ఈ సమస్య పూర్తిగా పరిష్కారం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డెమోగ్రాఫర్ హువాంగ్ వెంజెంగ్, టియాన్మెన్ నగరంలో అమలు చేసిన పథకాన్ని పరిశీలించి ఒక విషయాన్ని కనుగొన్నారు.. ఆ నగరం తమ ఆర్థిక వ్యవస్థలో 0.87శాతం జనన ప్రోత్సాహకాలపై ఖర్చు చేసినా, జననాల రేటులో కేవలం 0.1శాతం మాత్రమే పెరుగుదల కనిపించింది. జనాభా వేగంగా తగ్గితే, కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడతాయని, దీనివల్ల ఉద్యోగాలు తగ్గి, కార్మిక మార్కెట్‌లో ఇబ్బందులు పెరుగుతాయని ఆయన అంటున్నారు.సంతానోత్పత్తి రేటును ప్రతి మహిళకు 2.1 మంది పిల్లలకు పెంచాలంటే చైనా 30 నుండి 50 రెట్లు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆయన అంచనా వేశారు.

కేవలం ఆర్థిక సహాయం సరిపోదని చైనా ప్రభుత్వం కూడా అర్థం చేసుకుంది. అందుకే, జెజియాంగ్ ప్రావిన్స్‌లో పెళ్లి, పిల్లల సంరక్షణ కోసం వౌచర్లు ఇచ్చే ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. జాతీయ ఆరోగ్య కమిషన్ కూడా కుటుంబాల కోసం ఒక సమగ్ర ప్రణాళికను రూపొందిస్తోంది. అంతేకాకుండా, ప్రభుత్వం ఎక్కువ పని గంటలపై కూడా నియంత్రణ పెట్టడానికి ప్రయత్నిస్తోంది. డీజేఐ వంటి పెద్ద కంపెనీలు ఓవర్‌టైమ్‌ను తగ్గించుకుంటామని హామీ ఇచ్చాయి. 1,44,000 మంది తల్లిదండ్రులపై చేసిన ఒక సర్వేలో కేవలం 15శాతం మంది మాత్రమే ఎక్కువ పిల్లలను కోరుకుంటున్నారని తెలిసింది. అయితే, 1,000 యువాన్ల సబ్సిడీ గురించి తెలిసిన తర్వాత ఈ సంఖ్య 8.5% పెరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories