China: పెళ్లికి ముందే గర్భం దాలిస్తే ఫైన్..! ఎక్కడో తెలుసా?

Chinese Village Faces Backlash Over Fines For Unmarried Couples And Pregnancies
x

పెళ్లికి ముందే గర్భం దాలిస్తే ఫైన్..! ఎక్కడో తెలుసా?

Highlights

China: చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో ఉన్న లిన్‌కాంగ్ జిల్లాకు చెందిన ఓ గ్రామం తీసుకున్న కఠిన నిర్ణయాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

China: చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో ఉన్న లిన్‌కాంగ్ జిల్లాకు చెందిన ఓ గ్రామం తీసుకున్న కఠిన నిర్ణయాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సంప్రదాయ కుటుంబ విలువలు, నైతికతను కాపాడాలనే ఉద్దేశంతో గ్రామ పెద్దలు అమలు చేసిన నియమాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అధికారులు కూడా జోక్యం చేసుకున్నారు.

సహజీవనంపై జరిమానా

వివాహం కాకముందే కలిసి జీవిస్తే ఏటా 500 యువాన్లు (సుమారు రూ.6,000) జరిమానా విధిస్తామని గ్రామ పెద్దలు ప్రకటించారు. అలాగే పెళ్లికి ముందే గర్భం దాలిస్తే లేదా పెళ్లైన 10 నెలల లోపే బిడ్డ పుడితే రూ.38,000 (3,000 యువాన్లు) ఫైన్ తప్పదని నిబంధనలు రూపొందించారు.

బయటివారితో పెళ్లి అయితే ఫైన్

ఇతర గ్రామానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే 1,500 యువాన్లు (సుమారు రూ.19,000) జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

గొడవలు, మద్యం సేవనానికి కూడా శిక్షలు

దంపతుల మధ్య గొడవలు జరిగి గ్రామ పెద్దల వద్దకు వస్తే ఇద్దరూ చెరో 500 యువాన్లు

♦ మద్యం సేవించి గొడవ చేస్తే 3,000 నుంచి 5,000 యువాన్లు వరకు జరిమానా

ఈ అన్ని నియమాలను గ్రామ కార్యాలయం ముందు బోర్డుపై ఏర్పాటు చేశారు.

వైరల్ కావడంతో అధికారుల జోక్యం

ఆ బోర్డు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ అధికారులు రంగంలోకి దిగారు. చట్టవిరుద్ధమైన నిబంధనలుగా భావిస్తూ ఆ బోర్డును తొలగించాలని ఆదేశించారు.

గ్రామ పెద్దలు మాత్రం తమ నిర్ణయాల వెనుక ఉద్దేశ్యం కుటుంబ విలువలను కాపాడటమేనని స్పష్టం చేశారు. అయితే వ్యక్తిగత స్వేచ్ఛపై దాడిగా పలువురు విమర్శిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories