Colombia Plane Crash: కొలంబియాలో విమానం కుప్పకూలి 15 మంది మృతి: ఇద్దరు కీలక నేతలు దుర్మరణం.. ప్రమాదమా? కుట్రనా?

Colombia Plane Crash
x

Colombia Plane Crash: కొలంబియాలో విమానం కుప్పకూలి 15 మంది మృతి: ఇద్దరు కీలక నేతలు దుర్మరణం.. ప్రమాదమా? కుట్రనా?

Highlights

Colombia Plane Crash: కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం. నార్తె డె సంటాండర్ ప్రావిన్స్‌లో కూలిన చార్టర్డ్ విమానం. ఇద్దరు కీలక రాజకీయ నేతలతో సహా 15 మంది మృతి. ప్రమాదం వెనుక కుట్ర ఉందా? అనే కోణంలో దర్యాప్తు.

Colombia Plane Crash: కొలంబియాలో మరో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. దేశంలోని నార్తె డె సంటాండర్ (Norte de Santander) ప్రావిన్స్‌లో ఒక ప్రైవేట్ చార్టర్డ్ విమానం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రముఖ రాజకీయ నేతలతో సహా విమానంలో ఉన్న 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 13 మంది ప్రయాణికులు ఉండగా, ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారు.

అసలేం జరిగింది? విమానం గమ్యస్థానానికి చేరుకోవడానికి కొద్ది నిమిషాల ముందు రాడార్ నుంచి సంబంధాలు తెగిపోయినట్లు ఏవియేషన్ అధికారులు తెలిపారు. కొలంబియా–వెనిజులా సరిహద్దు సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో విమానం కూలిపోయినట్లు గుర్తించారు. విమానం కూలిన ప్రాంతం చేరుకోవడానికి వీలు లేని విధంగా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది.

ముఖ్య నేతల మృతిపై అనుమానాలు: ఈ ప్రమాదంలో కొలంబియాకు చెందిన ప్రముఖ రాజకీయ నేతలు క్విన్‌టెరో, సాలకెడో మరణించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వీరు ప్రయాణిస్తున్న సమయంలోనే విమానం రాడార్ నుంచి మాయమవ్వడం, సరిహద్దు ప్రాంతంలోనే కూలిపోవడం వంటి పరిణామాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఇది కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగిన ప్రమాదమా? లేక ఏవైనా విద్రోహ చర్యలు ఉన్నాయా? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.

దర్యాప్తు ముమ్మరం: ఘటనపై కొలంబియా పౌర విమానయాన సంస్థ పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాతే ప్రమాదానికి గల అసలు కారణాలు తెలుస్తాయని అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. ప్రభుత్వం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితుల కుటుంబాలకు సంతాపం ప్రకటించింది.




Show Full Article
Print Article
Next Story
More Stories