USA: అమెరికా సీక్రెట్ సర్వీస్‌ ఏజెన్సీ పని ఏంటో తెలుసా.? ఎలా పని చేస్తుందంటే..

Do you know what is the services by us secret service
x

USA: అమెరికా సీక్రెట్ సర్వీస్‌ ఏజెన్సీ పని ఏంటో తెలుసా.? ఎలా పని చేస్తుందంటే.. 

Highlights

USA: అమెరికా సీక్రెట్ సర్వీస్‌ ఏజెన్సీ పని ఏంటో తెలుసా.? ఎలా పని చేస్తుందంటే..

USA: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంట్‌పై జరిగిన దాడి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. థామస్ మాథ్యూ క్రూక్స్‌ అనే వ్యక్తి ట్రంప్‌పై కాల్పులు జరిపారు. దీంతో అమెరికా మాజీ అధ్యక్షుడి భద్రత అంశంపై చర్చ మొదలైంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం, ప్రపంచానికి పెద్దన్న అమెరికాలో అన్నీ ప్రత్యేకంగానే ఉంటాయి. ఇలాంటి శక్తివంతమైన అధ్యక్షుడి, మాజీ అధ్యక్షుడి భద్రత విషయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.

అమెరికా అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు వారి కుటుంబ సభ్యులతో పాటు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు రక్షణ కల్పించే భాద్యత 'యునైటెడ్‌ స్టేట్స్‌ సీక్రెట్ సర్వీస్‌' చూసుకుంటుంది. అలాంటి ఈ సీక్రెట్ సర్వీస్‌ తాజాగా ట్రంప్‌పై జరిగిన దాడి విషయంలో చేసిన వ్యాఖ్యలు పలు విమర్శలకు దారి తీస్తున్నాయి. ట్రంప్‌పై దాడి జరగడానికి స్థానిక పోలీసుల వైఖరే కారణమని సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెన్సీ చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో అసలు యునైటెడ్‌ స్టేట్స్‌ సీక్రెట్ సర్వీస్‌ విధులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన భద్రతా విభాగాల్లో సీక్రెట్ సర్వీస్‌ ముందు వరుసలో ఉంటుంది. దేశ అధ్యక్షుడికి ఏ స్థాయిలో భద్రత ఉంటుందో, మాజీ అధ్యక్షుడికి కూడా అదే స్థాయిలో భద్రత ఉంటుంది. మాజీ అధ్యక్షుడికి సుమారు 75 మంది 24 గంటలపాటు రక్షణగా ఉంటారు. ఆయన సందర్శించే ప్రదేశాలను సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు ముందే క్షుణ్నంగా తనిఖీ చేశారు. మాజీ అధ్యక్షుడికి సమీపంలోకి వచ్చే వారందరినీ ముందుగానే వారి పూర్తి వివరాలను ఆరా తీస్తారు.

మాజీ అధ్యక్షుడు సందర్శించే ప్రదేశాల్లో జాగిలాలను ముందుగానే మోహరిస్తారు. సీక్రెట్‌ సర్వీస్‌లో క్లోజ్డ్‌ ప్రొటెక్షన్‌ బృందం ఉంటుంది. అవసరమైతే ఈ సీక్రెట్‌ ఏజెంట్స్ తమ శరీరాన్ని కవచంగా ఉపయోగించి రక్షిస్తారు. వీరికితోడు కౌంటర్‌ అసాల్ట్‌ బృందం ఉంటుంది. అలాగే కౌంటర్‌ స్నైపర్‌ బృందం కూడా ఉంటుంది. దీని సాంకేతిక నామం ‘హెర్క్యులస్‌’. ఈ బృందం సభ్యులు.. దూరంగా మాటువేసి ఉండే స్నైపర్లను మట్టుబెడతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories