ప్రమాణ స్వీకారోత్సవంలో మెలానియాతో కలిసి ట్రంప్ డ్యాన్స్.. వీడియోలు వైరల్

Donald Trump dancing with Melania Trump
x

ప్రమాణ స్వీకారోత్సవంలో మెలానియాతో కలిసి ట్రంప్ డ్యాన్స్.. వీడియోలు వైరల్

Highlights

Donald Trump dance: అమెరికాలో ట్రంప్ 2.0 ప్రభుత్వం వచ్చేసింది. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం అనంతరం...

Donald Trump dance: అమెరికాలో ట్రంప్ 2.0 ప్రభుత్వం వచ్చేసింది. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్ తన భార్య, అమెరికా ఫస్ట్ లేడి మెలానియాతో కలిసి డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ట్రంప్ దంపతులతో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ దంపతుల కూడా డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్ రోటుండాలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాలకు చెందిన పలువురు అగ్రనేతలు, పారిశ్రామిక, టెక్ దిగ్గజాలు, అతిరథ మహారథులు హాజరయ్యారు. వీరందరి సమక్షంలో అగ్రరాజ్యం 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు.

గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ చేత అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. 1861లో అబ్రహం లింకన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ఉపయోగించిన బైబిల్, తన బైబిల్‌ను చేతిలో పట్టుకుని ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. ట్రంప్ కంటే ముందు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. దేశ, విదేశీ అతిథులతో క్యాపిటల్ హిల్ రోటుండా కిటకిటలాడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories