India-US Relations: ట్రంప్‌ నిర్ణయం తర్వాత ఇండియా-భారత్‌ రిలేషన్స్‌ ఎలా ఉండనున్నాయి?

India-US Relations
x

India-US Relations: ట్రంప్‌ నిర్ణయం తర్వాత ఇండియా-భారత్‌ రిలేషన్స్‌ ఎలా ఉండనున్నాయి?

Highlights

India-US Relations: ట్రంప్ ప్రకటించిన 26శాతం టారిఫ్‌తో ఇండియా-అమెరికా వ్యాపార సంబంధాల్లో ఉత్కంఠ నెలకొనగా, దీని ప్రభావం తాత్కాలికమేనన్న ఆశాజనక సంకేతాలు కనిపిస్తున్నాయి.

India-US Relations: డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాపార యుద్ధ ధోరణిని ప్రపంచానికి చూపించాడు. తాజా ప్రకటనతో, ఇండియాపై నేరుగా 26 శాతం టారిఫ్ విధించాడు. కారణంగా భారత్ తన దిగుమతులపై అధిక సుంకాలను విధిస్తున్నదనే అభియోగం. ఇది ట్రంప్ పాలనలో కీలక వ్యూహంగా మారింది. అంతర్జాతీయ వాణిజ్యంలో సమతుల్యత అవసరమని చెబుతూ ఇండియాను టార్గెట్ చేయడం గమనార్హం. ట్రంప్ ప్రకటనలో ఇండియాపై ప్రత్యేకంగా వ్యాఖ్యలు చేయడం, మోదీపై సానుకూలంగా మాట్లాడడం కూడా సంచలనంగా మారింది. కానీ, ఇవి రాజకీయ మిత్రుత్వం కన్నా ట్రేడ్ ప్రాధాన్యతకు ప్రాధాన్యతనిచ్చే దిశగా వెళ్లుతున్న సంకేతాలుగా కనిపిస్తున్నాయి.

ఇతర దేశాలతో పోలిస్తే ట్రంప్ భారత్ విషయంలో కొంత అనుకూలంగా ఉన్నట్టే కనిపించినా, దీని స్థిరత్వంపై అనుమానాలే. అమెరికా పైగా భారత్ నుంచి దిగుమతులపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ, ఇప్పుడు తీసుకున్న నిర్ణయం శాశ్వతం కాదు. ఈ టారిఫ్ డిస్కౌంట్ ఎప్పుడైనా ఎత్తివేయవచ్చు. అమెరికా ఇప్పటి వరకు ఆటోమొబైల్ రంగం వంటి కీలక విభాగాల్లో తక్కువ సుంకాలే వేసింది. కానీ భారత్ అధికంగా విధించడం వల్లే ఈ రివర్స్ టారిఫ్‌లు తీసుకొచ్చారు.

ఇండియా-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు అనేక దశలుగా చర్చల మధ్యే నిలిచిపోయాయి. 2030 నాటికి వాణిజ్య విలువ 500 బిలియన్ డాలర్లకు చేరాలని లక్ష్యం ఉన్నప్పటికీ, ప్రస్తుతం పరిస్థితులు దానికన్నా భిన్నంగా ఉన్నాయి. ఒకవేళ ట్రంప్ విధించిన ఈ నిర్ణయాన్ని చర్చల ద్వారా వెనక్కు తీసుకొస్తే, ఆర్థిక సంబంధాల పునరుద్ధరణకు మార్గం ఏర్పడుతుంది. ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఇండియా మృదుత్వంతో స్పందిస్తూ, కొన్ని విభాగాల్లో సౌలభ్యం కల్పించేందుకు సిద్ధంగా ఉందని సంకేతాలు ఇచ్చింది. ఇది రెండు దేశాల మధ్య సహకారానికి మార్గం వేయగలదు.

ఇది కేవలం వ్యాపార సంబంధాలకే పరిమితమయ్యే సమస్య కాదు. ఇండియా, అమెరికా క్వాడ్, IPEF వంటి అంతర్జాతీయ కూటముల్లో భాగస్వామ్యాన్ని పెంచుతున్నాయి. మిలిటరీ, టెక్ రంగాల్లో కూడా రెండు దేశాల మధ్య బలమైన బంధం ఉంది. అటువంటి దృక్పథంలో ట్రంప్ తాజా టారిఫ్‌లు తాత్కాలిక అవ్వచ్చు. చర్చల ద్వారా పరిష్కారం దిశగా మారే అవకాశం ఉంది. అమెరికా, ఇండియా మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలు దీన్ని సమర్థంగా పరిష్కరించగలవు.

Show Full Article
Print Article
Next Story
More Stories