24 గంటల కంటే తక్కువ సమయంలోనే తన చుట్టూ తాను తిరిగిన భూమి.. సరికొత్త రికార్డు..

Earth Completes Rotation In Less Than 24-Hours
x

24 గంటల కంటే తక్కువ సమయంలోనే తన చుట్టూ తాను తిరిగిన భూమి.. సరికొత్త రికార్డు..

Highlights

Earth Rotation: భూభ్రమణం విషయంలో సరికొత్త రికార్డు నమోదైంది.

Earth Rotation: భూభ్రమణం విషయంలో సరికొత్త రికార్డు నమోదైంది. భూమి 24 గంటల కంటే తక్కువ సమయంలోనే తన చుట్టూ తాను తిరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. 24 గంటలకు 1.59 మిల్లీ సెకన్ల సమయం తక్కువగా భూమి తన భ్రమణాన్ని పూర్తిచేసిందంటున్నారు. ఇది ఈ నెల 29న సంభవించిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 1960లో జులై19న భూమి 24 గంటల కంటే 1.47 మిల్లీ సెకండ్ల తక్కువ సమయంతో భ్రమణం పూర్తిచేసింది. ఇప్పటివరకు ఇదే రికార్డుగా ఉంది. అయితే, తాజాగా 1.59 మిల్లీసెకన్ల తేడాతో భూమి తనను తాను చుట్టేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది.

కాగా, భూభ్రమణంలో ఈ వేగం భౌగోళిక ధ్రువాల కదలికలకు సంబంధించిన అంశమని పరిశోధకులు చెబుతున్నారు. దీన్నిచాండ్లర్ వొబుల్ అంటారని తెలిపారు. బొంగరం తిరగడం ప్రారంభించినప్పుడు వేగం పుంజుకుని, తర్వాత క్రమంగా వేగం తగ్గిపోతుంది. అలాగే భూమి కూడా ఒక్కోసారి వేగం పుంజుకుంటుందని వారు వివరించారు. ఇటీవలకాలంలో భూమి తన చుట్టూ తాను తిరిగే వేగంలో పెరుగుదల కనిపిస్తోందని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories