Earthquake: యుద్ధం మధ్య ఇరాన్‌లో భూకంపం..!

Earthquake: యుద్ధం మధ్య ఇరాన్‌లో భూకంపం..!
x

Earthquake: యుద్ధం మధ్య ఇరాన్‌లో భూకంపం..!

Highlights

Earthquake: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న తరుణంలో ఇరాన్‌లో భూకంపం సంభవించింది.

Earthquake: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న తరుణంలో ఇరాన్‌లో భూకంపం సంభవించింది. మంగళవారం దక్షిణ ఇరాన్‌లోని గెరాష్ (Gerash) ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదైనట్లు భూగర్భ పరిశోధన సంస్థలు వెల్లడించాయి.

ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌పై ఇజ్రాయెల్ మరియు అమెరికా దళాలు ఉమ్మడిగా సైనిక చర్య (Operation Epic Fury) కొనసాగిస్తున్నాయి. ఈ దాడుల వల్ల ఇప్పటికే ఇరాన్ అట్టుడుకుతుండగా, ఇప్పుడు భూకంపం రావడం అక్కడి ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. భూకంప కేంద్రం గెరాష్‌కు సమీపంలో ఉండటంతో, సమీపంలోని కీలక వ్యవస్థలపై దీని ప్రభావంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. తమ వద్ద లెక్కలేనన్ని ఆయుధాలున్నాయని, 24 గంటల్లో ఇరాన్‌ (Iran)పై భీకరదాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories