Elon Musk: మనిషి మెదడుకు ఎలక్ట్రానిక్‌ చిప్‌.. 6 నెలల్లో మానవులపై ప్రయోగాలకు సిద్ధం

Elon Musk Hopes To Test Brain Chip In Humans Soon
x

Elon Musk: మనిషి మెదడుకు ఎలక్ట్రానిక్‌ చిప్‌.. 6 నెలల్లో మానవులపై ప్రయోగాలకు సిద్ధం

Highlights

Elon Musk: పక్షవాతంతో మీ అవయవాలు పని చేయడం లేదా?

Elon Musk: పక్షవాతంతో మీ అవయవాలు పని చేయడం లేదా? కంటి చూపు ఇక రాదని బాధపడుతున్నారా? మీ పిల్లలు తెలివితేటలు చూపించడం లేదా? అయితే మీరు ఇక చింతించాల్సిన అవసరం లేదు.. అందుకు ఆధునిక సాంకేతికత త్వరలో అందుబాటులోకి రానున్నది. మనిషి అవయవ లోపాలను అధిగమించేందుకు.. వాటికి చిప్‌లను అమర్చనున్నారు. ఈ ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామంటూ తాజాగా న్యూరాలింక్ అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. మానవ మెదడులో చిప్‌ను అమర్చే ప్రక్రియను నిర్వహించే రోబోను పరిచయం చేశారు. అమెరికాకు చెందిన ఆహార, ఔషధ నియంత్ర సంస్థ-ఫీడీఏ అనుమతుల కోసం పత్రాలను సిద్ధం చేస్తున్నట్టు ఎలాన్‌ మస్క్‌ తెలిపారు. దీంతో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని ప్రపంచ కుబేరుడు స్పష్టం చేశారు. అసలు న్యూరాలింక్ సంస్థ ఏం చేస్తుంది? ఎలాంటి టెక్నాలజీని మనుషులకు అమర్చనున్నది?

మనిషి మెదడుకు చిప్‌లను అమర్చే ప్రయోగాలకు సిద్ధమని ప్రపంచ కుబేరుడు, న్యూరాలింక్ అధినేత ఎలాన్‌ మస్క్‌ సంచలన కీలక ప్రకటన చేశారు. బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ - బీసీఐ సాంకేతికతను మరో ఆరు నెలల్లో మానవులపై ప్రయోగించనున్నట్టు తెలిపారు. కాలిఫోర్నియాలోని ఫ్రెమోంట్‌లోని న్యూరాలింక్‌ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎలాన్‌ మస్క్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రాజెక్టు తాజా వివరాలను మస్క్‌ సహా, న్యూరాలింక్‌ బృందం వివరించింది. మానవ మెదడులో అమర్చబోయే చిప్‌తో పాటు ఈ ప్రక్రియను నిర్వహించే రోబోను కూడా పరిచయం చేశారు. ఈ ప్రయోగాలు నిర్వహించేందుకు అమెరికకు చెందిన ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ- FDAకు దరఖాస్తు చేయనున్నట్టు మస్క్‌ తెలిపారు. అలాగే ఇప్పటి వరకు ఎఫ్‌డీఏతో జరిపిన చర్చలు సానుకూలంగా సాగాయని వివరించారు. పక్షవాతం వచ్చినవారిలో దెబ్బతిన్న అవయవాలను కదిలించేలా ఓ చిప్‌ను రూపొందించామని.. దాన్ని వెన్నుపూసలో అమర్చనున్నట్టు మస్క్‌ తెలిపారు. అలాగే చూపు కోల్పోయిన వారికి సాయపడేలాగా ఓ పరికరాన్ని కూడా సిద్ధం చేస్తున్నట్లు మాస్క్‌ వెల్లడించారు. ఈ ప్రయోగాల్లో తాము విజయం సాధిస్తామని మస్క్‌ ధీమా వ్యక్తం చేశారు. మావన మేధస్సు, శక్తి సామర్థ్యాలను పెంచేందుకు బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ పని చేస్తుందని మస్క్‌ స్పష్టం చేశారు. అసలు న్యూరాలింక్‌ ఏం చేయబోతోంది? నేరుగా మనుషులపై ప్రయోగాలకు సిద్ధమవుతోందా?

శరీరంలోని వివిధ అవయవాలకు నాడీ కణాల ద్వారా మెదడు సంకేతాలను అందుకొని.. అవసరమైన సంకేతాలను పంపుతుంది. ఈ కణాలు పరస్పరం సంధానమై.. పెద్ద నెట్‌వర్కే ఉంటుంది. న్యూరో ట్రాన్స్‌ మీటర్లు అనే రసాయన సంకేతాలతో ఈ నెట్‌వర్క్‌ పని చేస్తుంది. మెదడులోని నాడీ కణాలకు సమీపంలో ఎలక్ట్రోడ్లను ఉంచి.. వాటిలోని విద్యుత్‌ సంకేతాలను రికార్డు చేసేందుకు ఓ చిప్‌ను అమర్చడమే న్యూరాలింక్‌ లక్ష్యం. మెదడులోని ఆలోచనా శక్తి సాయంతో యంత్రాలతో అనుసంధానం అవ్వచొచ్చు. అలాగే నాడీ, కదలికలకు సంబంధించిన వ్యాధులకు చికిత్సను కూడా అందించవ్చు. సూటిగా చెప్పలాంటే.. మన మెదడు ద్వారే.. యంత్రాలను నేరుగా నియంత్రించవచ్చు. ఉదాహరణకు ఆ చిప్ అమర్చి ఉంటే.. కారు నేరుగా వచ్చి ముందు ఆగేలా నేరుగా మనం ఆదేశించవచ్చు. మనం ఇంటికి వెళ్లగానే నేరుగా మనం తలుపును తెరవచ్చు. సోఫాలో కూర్చొని ఫ్యాన్‌ ఆన్ చేయవచ్చు. ఇవే కాదు.. మరెన్నో అద్భుతాలను వీటి ద్వారా ఆవిష్కరించవచ్చని న్యూరాలింక్ చెబుతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా.. ఇప్పటికే ఓ వానరానికి మెదడులో చిప్‌ను న్యూరాలింక్‌ మర్చింది. తాజా సమావేశంలో కోతి వీడియో గేమ్‌ ఆడుతున్న విషయాన్ని ఎలాన్‌ మస్క్‌ చూపించారు. మెదడులో అమర్చిన చిప్‌ ద్వారా వానరం కంప్యూటర్‌కు ఆదేశాలు ఇవ్వగలిగింది. తనకు కావాల్సిన ఆహారాన్ని అడిగింది. ఇది విజయవంతం కావడంతో.. న్యూరాలింక్‌ మరో అడుగు ముందుకేసి.. మానవులపై ప్రయోగాలకు సిద్ధమైంది.

బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ ప్రాజెక్టులో భాగంగా.. 8 మిల్లీ మీటర్ల వ్యాసం కలిగిన ఎన్‌1 అనే చిప్‌ను న్యూరాలింక్‌ రూపొందించింది. దానికి సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వెంట్రుకతో పోలిస్తే.. వాటి మందం 20వ వంతు మాత్రమే ఉంటుంది. మెదడులోపల అమర్చే ఈ చిప్‌.. చెవిపై ఉండే మరో సాధనంతో వైరస్‌లెస్‌ పద్ధతిలో అనుసంధానమై ఉంటుంది. ఇది బ్లూటూత్‌ సాయంతో సమీపంలోని స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్‌ అవుతుంది. న్యూరాలింక్‌ ఇప్పటికే పందులు, గొర్రెలు, కోతుల్లో విజయవంతంగా ప్రయోగించింది. ఈ చిప్‌ను పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి.. అక్కడ ఎన్‌1 చిప్‌ను అమరుస్తారు. ఈ చిప్‌ నుంచి సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఈ చిప్‌లో మూడువేలకు పైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన ప్రాంతాలకు చేరువగా ప్రవేశపెడుతారు. వీటి వల్ల మెదడుకు ఎలాంటి నష్టం కలగకుండా.. ఎలక్ట్రోడ్లు ఎటు కావాలంటే అటు వంగేలా ఉంటాయి. ఇలా ఓ డాక్టర్‌ అమర్చడం అంత్యంత కష్టంతో కూడుకున్నది. అందుకే అందుకోసం ఓ రోబోను కూడా న్యూరాలింక్‌ అభివృద్ధి చేసింది. ఈ ప్రక్రియను కేవలం గంటలో పూర్తి చేస్తుంది. ఇక చిప్‌లోని బ్యాటరీ కూడా వైర్‌లెస్‌ పద్దతిలోనూ చార్జింగ్‌ అవుతుంది. దీనివల్ల ఈ చిప్‌ను ధరించినవారు సాధారణంగానే కనిపిస్తారు. ఈ చిప్‌లను చాలా సులువుగా.. తక్కువ ఖర్చుతో చేసేలా అభివృద్ధి చేస్తామని ఎలాన్‌ మస్క్‌ గతంలో ప్రటించారు. అయితే చిప్‌ను పుర్రెలోనే అమర్చడం దేనికి? బయట ఎందుకు అమర్చడం లేదు? చిప్‌ ఎలా పని చేస్తుంది?

ఈ చిప్‌ను పుర్రెలోనే అమర్చడానికి మరో కారణం ఉంది. ఒకవేళ అది పడిపోయినా.. దూరంగా పెట్టినా.. మెదడుకు సంకేతాలు అందవు.. పైగా ఎలక్ట్రోడ్లను అనుసంధానం చేయాలంటే.. పుర్రె లోపల ఉండడమే సురక్షితమని న్యూరాలింక్‌ చెబుతోంది. సాధారణంగా మన మెదడు ఇచ్చే ఆదేశాలను.. మన శరీర బాగాలు పాటించి.. ఆ పనులను చేస్తాయి. అలా ఇచ్చే ఆదేశాలను.. చిప్‌లోని ఎలక్ట్రోడ్లు గుర్తిస్తాయి. వాటిని వెంటనే ఎన్‌1 చిప్‌కు పంపుతాయి. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే ఆల్గారిథమ్‌లుగా మారుస్తుంది. వీటి ద్వారా మనుషులు, కంప్యూటర్లు నేరుగా కనెక్ట్‌ అయ్యే అవకాశం లభిస్తుంది. అంటే.. కంప్యూటర్‌లోని ఏదైనా ఫైల్‌ను... నేరుగా మెదడుతోనే చూడవచ్చు. కంప్యూటర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ చిప్స్‌ ద్వారా మనిషిలోని అల్జీమర్స్‌, పార్కిన్‌సన్స్‌, డిమెన్షియా, ఇతర మానసిక సమస్యలకు పరిష్కారం లభించనున్నది. ఇక మీరు నేర్చుకోవాలనుకున్న కోర్సును నేరుగా మీరు మెదడులోకి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మనస్సులో అనుకుంటున్న విషయాలను రాయాలనుకున్నా.. లేదా.. వాయిస్‌ రికార్డు చేయాలన్నా.. నేరుగా కంప్యూటర్లలో లేదా మొబైల్‌లో ఆ పని చేయవచ్చు. భవిష్యత్త్‌లో ఈ చిప్‌తో ఎన్నో అద్భుతాలు సాధించవచ్చని న్యూరాలింక్‌ చెబుతోంది. అయితే ఈ ప్రయోగాలతో ప్రయోజనాలు సరే.. నష్టాలు లేవా? ఉంటే ఎలాంటి నష్టాలు ఉంటాయి?

అయితే పలువురు న్యూరాలింక్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ మెదడుపై శాస్త్రవేత్తలకు సరైన అవగాహన లేదని.. ఈ ప్రాజెక్టుతో సవాళ్లు ఎదురు కావొచ్చంటున్నారు. న్యూరాలింక్‌తో రికార్డు చేసే డేటాను దుర్వినియోగం చేయవచ్చవన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కంప్యూటర్లు, ఫోన్లు హ్యాక్‌ అవుతున్నట్టు భవిష్యత్తులో మనిషి కూడా హ్యాక్‌ అయితే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories