ఎలాన్ మస్క్: నా పార్టనర్‌కు భారతీయ మూలాలు, నా కొడుకు పేరు శేఖర్

ఎలాన్ మస్క్: నా పార్టనర్‌కు భారతీయ మూలాలు, నా కొడుకు పేరు శేఖర్
x

ఎలాన్ మస్క్: నా పార్టనర్‌కు భారతీయ మూలాలు, నా కొడుకు పేరు శేఖర్

Highlights

టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధిపతి, టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్, జెరోధా సంస్థ సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

మస్క్ తన కొడుకు పేరు శేఖర్ అని వెల్లడిస్తూ, న్యూరాలింక్ ఉన్నతాధికారి శివోన్ జిలిస్‌తో తన రిలేషన్‌షిప్ గురించి వివరించారు. మస్క్ చెప్పారు, “మీకు తెలుసో లేదో కానీ నా పార్టనర్ శివోన్ జిలిస్‌కు భారత మూలాలు ఉన్నాయి. మా కొడుక్కి మిడిల్ నేమ్‌గా శేఖర్ అని పెట్టాము.”

శివోన్ జిలిస్ చిన్నతనం కెనడాలోనే గడిచిందని, ఆమె తండ్రి అంతర్జాతీయ ఎక్సేంజ్ స్టూడెంట్‌గా ఉన్నారని, ఆమెను చిన్నప్పుడే దత్తత తీసుకున్నారని మస్క్ తెలిపారు. అయితే, ఆమె పూర్తి నేపథ్యం గురించి ఆయనకు పూర్తి వివరాలు తెలియవని పేర్కొన్నారు.

టెక్ రంగంలో అనుభవం ఉన్న శివోన్ జిలిస్, ప్రస్తుతం న్యూరాలింక్‌లో ఆపరేషన్స్, స్పెషల్ ప్రాజెక్ట్స్ విభాగానికి డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. బాల్యాన్ని కెనడాలో గడిపి, యేల్ యూనివర్శిటీలో ఆర్థిక శాస్త్రం, ఫిలాసఫీలో పట్టభద్రురాలు అయ్యారు. IBM, Bloomberg సంస్థల్లో అనుభవం సంతరించుకున్న తర్వాత 2016లో AI వైపు దృష్టి మళ్లించి OpenAIలో చేరారు. అత్యంత యువ వయసులో బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సభ్యురాలిగా ఎదిగి, 2023లో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

మస్క్ మరియు జిలిస్‌కు 2021లో స్ట్రైడర్, అజూర్ అనే జంట పిల్లలు జన్మించగా, 2024లో కూతురు ఆర్కేడియా పుట్టారు.

అమెరికాలోని భారతీయ నిపుణులపై కూడా మస్క్ ప్రశంసలు కురిపించారు. వారి ప్రతిభ వల్ల అమెరికాకు ఎంతో లాభమవుతుందని, అయితే కొందరు హెచ్-1బీ వీసా వ్యవస్థను దుర్వినియోగం చేశారని ఆయన పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories