India-Pakistan War: పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఇంటి సమీపంలో పేలుడు..త్రుటిలో తప్పించుకున్న షాబాజ్

India-Pakistan War: పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఇంటి సమీపంలో పేలుడు..త్రుటిలో తప్పించుకున్న షాబాజ్
x
Highlights

India-Pakistan War: భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పై గురువారం రాత్రి పాకిస్తాన్...

India-Pakistan War: భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పై గురువారం రాత్రి పాకిస్తాన్ క్షిపణులను ప్రయోగించింది. అయితే వాటిని భారత సైన్యం ధీటుగా ఎదుర్కొంది. వాటిని అక్కడే కూల్చివేసింది. ప్రతీకారంగా పాకిస్తాన్ పై బాంబుల వర్షం కురిపించింది. కరాచీతోపాటు పలు నగరాల్లో భారీగా బాంబు మోత మోగించింది. దీంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.

అయితే ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసానికి అతి దగ్గరగా భారీ పేలుడు సంభవించింది. సుమారు 2 కిలోమీటర్ల పరిధిలోనూ ఊహించని విధంగా ఈ ఘటన జరగడంతో వెంటనే షరీఫ్ ను ఆయన వ్యక్తిగత సిబ్బంది సురక్షిత బంకర్ లోకి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు కాసేపట్లోనే ధ్రువీకరించనున్నాయి. మరోవైపు భారత ఆర్మీ తెల్లవారే సరికే పాకిస్తాన్ ను కకావికలం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories