UN COP30: కాప్‌30 స‌ద‌స్సులో అగ్ని ప్ర‌మాదం.. 21 మందికి గాయాలు..

UN COP30: కాప్‌30 స‌ద‌స్సులో అగ్ని ప్ర‌మాదం.. 21 మందికి గాయాలు..
x
Highlights

UN COP30: బ్రెజిల్‌లోని బీల‌మ్ సిటీలో యూఎన్ కాప్‌30 స‌ద‌స్సులో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఓ పెవిలియ‌న్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

UN COP30: బ్రెజిల్‌లోని బీల‌మ్ సిటీలో యూఎన్ కాప్‌30 స‌ద‌స్సులో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఓ పెవిలియ‌న్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఎగ్జిట్ గేట్ల నుంచి వేల సంఖ్య‌లో ప్ర‌తినిధులు.. సుర‌క్షిత ప్రాంతానికి ప‌రుగులు తీశారు. ఈ ప్ర‌మాదంలో 21 మందికి గాయ‌లు అయ్యాయి. స‌ద‌స్సు కోసం ఏర్పాటు చేసిన బ్లూ జోన్‌లో ఘ‌ట‌న జ‌రిగింది. మంట‌లు ద‌ట్టంగా వ్యాపించ‌డంతో అన్ని ఎగ్జిట్ గేట్ల నుంచి జ‌నం ప‌రుగులు తీశారు. సుమారు ఆరు గంట‌ల వ్య‌వ‌ధి త‌ర్వాత మ‌ళ్లీ స్టాల్స్‌ను ఓపెన్ చేశారు. 21 మందికి చికిత్స అందించిన‌ట్లు బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ తెలిపింది. పొగ పీల్చ‌డం వ‌లన 19మంది అస్వ‌స్థతకు గురవగా.. ఎవ‌రికీ కాలిన గాయాలు కాలేదని వెల్లడించింది.

అగ్నిప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో యూఎన్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఆంటోనియో గుటెర్ర‌స్ అక్క‌డే ఉన్నారు. ఆయ‌న్ను సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించారు. భార‌త ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి భూపేంద‌ర్‌ యాద‌వ్ కూడా ప్ర‌మాదం జ‌రిగిన ప్ర‌దేశంలో ఉన్నారు. మంత్రి భూపేందర్‌తో పాటు భార‌త ప్ర‌తినిధుల బృందం సుర‌క్షిత ప్రాంతానికి వెళ్లింది. భార‌త బృందం సుర‌క్షితంగా ఉన్న‌ట్లు మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories