Indonesia boat accident: ప్రయాణికులతో వెళుతోన్న పడవ బోల్లా.. నలుగురు మృతి, 38 మంది గల్లంతు

Indonesia boat accident: ఇండోనేషియాలోని బాలిలో 65మంది ప్రయాణికులతో వెళుతున్న ఒక పడవ అకస్మాత్తుగా మునిగిపోయింది.

Indira Ram
Published on: 3 July 2025 2:15 PM IST
Indonesia boat accident
X

Indonesia boat accident: ప్రయాణికులతో వెళుతోన్న పడవ బోల్లా.. నలుగురు మృతి, 38 మంది గల్లంతు

Indonesia boat accident: ఇండోనేషియాలోని బాలిలో 65మంది ప్రయాణికులతో వెళుతున్న ఒక పడవ అకస్మాత్తుగా మునిగిపోయింది. ఆ సమయంలో పడవలోని ఫెర్రిలో 53 మంది ప్రయాణికులు, 12మంది సిబ్బంది ఉన్నారు. అయితే వీరిలో నలుగురు చనిపోగా.. 42 మంది గల్లంతయ్యారు. మిగిలిన 23 మందిని రెస్కూ సిబ్బంది రక్షించారు. అయితే గల్లంతైన వారిని సిబ్బంది వెతుకుతున్నారు. బుధవారం రాత్రి జావా నుంచి బాలి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ మధ్య కాలంలో ప్రయాణికులతో వెళుతున్న పడవలు మునిగిపోవడం ఎక్కువగా వింటున్నాం. గత రెండేళ్లలో భారీ స్థాయిలో బోట్ యాక్సిండెంట్లు జరిగాయి. తాజా సమాచారం ప్రకారం, ఇండోనిషయా బోటు.. తూర్పు జావాలోని బన్యువాంగి రీజెన్సీలోని కేతాపాంగ్ సముద్ర ఓడరేవు నుండి బాలి ద్వీపంలోని జెంబ్రానా రీజెన్సీలోని గిలిమునుక్‌ సముద్ర ఓడరేవుకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదంపై పోలీసులు మరింత విస్తృతంగా విచారణ జరుపుతున్నారు. మరో పక్క గల్లంతైన వారి రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు.

Indira Ram

Indira Ram

Next Story