India Pakistan War: పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించిన జీ7 దేశాలు.. భారత్-పాక్‌ ఉద్రిక్తతలపై కీలక ప్రకటన

India Pakistan War: పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించిన జీ7 దేశాలు.. భారత్-పాక్‌ ఉద్రిక్తతలపై కీలక ప్రకటన
x

India Pakistan War: పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించిన జీ7 దేశాలు.. భారత్-పాక్‌ ఉద్రిక్తతలపై కీలక ప్రకటన

Highlights

India Pakistan War: భారత్- పాకిస్థాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

India Pakistan War: భారత్- పాకిస్థాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్ భారత్ ఇరుదేశాలు ఉద్రిక్తతలు తగ్గించాలని జీ7 దేశాలు కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, యూకే, అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ పలు దేశాలు కోరాయి. ఏప్రిల్‌ 22న పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని.. అదే సమయంలో భారత్‌-పాకిస్తాన్‌ దేశాలు సంయమనం పాటించాలన్నాయి.

సైనిక తీవ్రత ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని, రెండువైపులా పౌరుల భద్రత విషయంలో ఆందోళన చెందుతున్నట్లు పేర్కొంది. తక్షణం ఉద్రిక్తతలు తగ్గించాలని పిలుపునిస్తున్నట్లు తెలిపింది. పరిస్థితి శాంతించేందుకు ఇరుదేశాలు చర్చలు జరపాలని కోరింది. ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని.. సమస్యకు శాశ్వత దౌత్యపరమైన పరిష్కారం విషయంలో తమ మద్దతును ప్రకటిస్తున్నట్లు ప్రకటనలో జీ7 దేశాలు పేర్కొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories