Heatwave: వేడి సెగలతో అల్లాడుతున్న ఉత్తరాఫ్రికా..రికార్డ్ స్థాయిలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు

Heatwave
x

Heatwave: వేడి సెగలతో అల్లాడుతున్న ఉత్తరాఫ్రికా..రికార్డ్ స్థాయిలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు

Highlights

Heatwave: క్లయిమేట్ ఛేంజ్ ప్రభావం అంతకంతకు పెరుగుతోంది. పలు దేశాల్లో భానుడు భగభగ మండిపోతున్నాడు. వేడి సెగలతో జనం అల్లాడిపోతున్నారు. అత్యంత రికార్డుల స్థాయిలో అక్కడ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Heatwave: క్లయిమేట్ ఛేంజ్ ప్రభావం అంతకంతకు పెరుగుతోంది. పలు దేశాల్లో భానుడు భగభగ మండిపోతున్నాడు. వేడి సెగలతో జనం అల్లాడిపోతున్నారు. అత్యంత రికార్డుల స్థాయిలో అక్కడ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాఫ్రికాలోని మొరాకో సూర్యుడు అక్కడ జనాలకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటివరకు ఎప్పుడూ ఇంత పెద్ద స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కాకపోవడంతో అధికారులు సైతం భయపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..

ఈ సారి మనకు ఎండాకాలం అంతగా లేదనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ రుతుపవనాలు ముందుగానే రావడంతో వానలు కురిసాయి. ఇప్పటికీ పలు చోట్ల వానలు కురుస్తూనే ఉన్నాయి. అయితే ఉత్తర ఆఫ్రికాలో భీకరంగా ఎండలు మండిపోతున్నాయి. వేడి సెగలు ఎక్కువవడంతో జనం వణికిపోతున్నారు. ముఖ్యంగు మొరాకో నగరం ఎండలకు మండిపోతుంది. మొరాకో తీర ప్రాంత నగరమైన కాసాబ్లాంకాలో 39.5సికి చేరింది. దీంతో 2011లో నమోదైన 38.6సి రికార్డును అధిగమించింది. మొరాకో తీరానికి 250 కిమీ దూరంలో ఉన్న లారాచేలో కూడా ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇప్పడు అక్కడ 43.8సి గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది 2017 జూన్‌లో నమొదైన దాని కంటే చాలా ఎక్కువ.

అదేవిధంగా సెంట్రల్ మొరాకోలో ఉన్న బెన్ గెరిర్‌‌ కూడా వేడితో అల్లాడుతుంది. అక్కడ 46.4సి ఉష్ణోగ్రత నమోదైంది. రెండేళ్ల క్రితానికి ఇప్పటికి నమోదైన ఉష్ణోగ్రతలకు అసలు సంబంధమే లేదు. అత్యధికంగా ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. దీన్ని బట్టి చూస్తే అట్లాంటిక్ ప్రాంతాలపై దీని ప్రభావం ఏమైనా పడుతుందేమోనని అధికారులు భయపడుతున్నారు. ఇంకా ముందు ముందు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయోనని ఆంధోళన చెందుతున్నారు.

మొరాకో దేశానికి పలు దేశాల నుంచి టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు. మన దేశం నుంచి కూడా చాలామంది వేసవికాలంలో అక్కడ ఎంజాయ్ చేయడానికి వెళుతుంటారు. అయితే ఇప్పుడు అక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల వెళ్లకుండా ఉండటమే మంచిదని అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories