Gaza Peace Deal: గాజా శాంతి ఒప్పందం ట్రంప్ సంతకం, పాక్‌లో TLP ఆందోళనలు

గాజా శాంతి ఒప్పందం: ట్రంప్ సంతకం, పాక్‌లో TLP ఆందోళనలు
x

గాజా శాంతి ఒప్పందం: ట్రంప్ సంతకం, పాక్‌లో TLP ఆందోళనలు

Highlights

రెండేళ్ల భీకర పోరు తర్వాత పశ్చిమాసియాలో మళ్లీ ప్రశాంతత ఏర్పడుతోంది.. గాజాపై ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధాన్ని నిలిపేస్తూ చరిత్రాత్మక ఒప్పందంపై ప్రపంచ దేశాల నేతల సాక్షిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు.

రెండేళ్ల భీకర పోరు తర్వాత పశ్చిమాసియాలో మళ్లీ ప్రశాంతత ఏర్పడుతోంది.. గాజాపై ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధాన్ని నిలిపేస్తూ చరిత్రాత్మక ఒప్పందంపై ప్రపంచ దేశాల నేతల సాక్షిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు. ఇందుకు సహకరించిన వివిధ దేశాల అధినేతలకు కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో ట్రంప్‌ను పాక్ ప్రధాని షెహబాజ్ అతిగా పొగడబోయి అభాసుపాలయ్యారు. హమాస్ తన చెరలోకి ఇజ్రాయెలీ బందీలను విడుదల చేయగా ఇజ్రాయెల్‌ 1900 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాలకు ట్రంప్‌కు అత్యున్నత అవార్డుల్ని ప్రకటించాయి.


ఓవైపు ఇజ్రాయిల్, పాలస్తీనాలోని గాజాలు శాంతి ఒప్పందం చేసుకొని పరస్పరం బందీలను విడిపించుకునే పనిలో పడ్డారు. ఈ రెండు దేశాలకు లేని బాధ పాకిస్తాన్‌కు చెందిన TLP సంస్థకు వచ్చినట్టు ఉంది. గాజాలో ట్రంప్ చేపట్టిన శాంతి ప్రక్రియకు నిరసనగా ఈ సంస్థ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పాకిస్తాన్‌లోని అనేక నగరాలు అట్టుడికిపోతున్నాయి. ఆందోళనల్లో అనేక మంది చనిపోయారని సమాచారం. కాగా పాకిస్తాన్ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతున్న కీలక సమయంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈజిప్టులోని షర్మ్‌ ఎల్‌-షేక్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి సంబరాల్లో మునిగిపోయారనే విమర్శలు వస్తున్నాయి.


ప్రపంచానికి తానే పెద్ద దిక్కుగా జబ్బలు చరుచుకుంటుంది అమెరికా.. అనేక దేశాల్లో మానవ హక్కులకు భంగం కలుగుతుంతోందని, మైనారిటీలపై హింస చోటు చేసుకుంటుందని నివేదికలు తయారు చేసి బెదిరిస్తుంటుంది. ముఖ్యంగా భారత దేశంలో ఏం జరిగినా భూతద్దంలో పెద్దగా చూస్తుంది అగ్రరాజ్యం. అయితే సొంత దేశంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యహరించడం ఇక్కడ గమనించవచ్చు.. చేయని తప్పుకు ఓ ప్రవాస భారతీయుడు తన జీవితంలో అత్యంత విలువైన కాలాన్ని కోల్పోయాడు. 43 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా సుబ్బు వేదంకు న్యాయం జగడంలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories