Helen Storm America: అమెరికాలో హెలెనా తుఫాన్ బీభత్సం.. 52 మంది మృతి

helen storm america
x

helen storm america

Highlights

Helen Storm America: అమెరికాలో హెలెనా తుఫాన్ బీభత్సం సృష్టించింది. 52 మంది మృతి చెందారు. అంధకారంలో 30 లక్షల మంది ఉన్నారు.

Helen Storm America: అతి తీవ్రమైన హరికేన్ హెలేనా అమెరికాలో భారీ విధ్వంసం సృస్ఠించింది. ఈ పెను తుపాను ధాటికి ఇప్పటి వరకు దాదాపు 52 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది.. ఓ 89 ఏళ్ల వృద్ధురాలు, ఒక మహిళతో పాటు ఆమెకు నెల రోజుల క్రితం జన్మించిన కవలలు సైతం ఉన్నట్టు అదికార వర్గాలు వెల్లడించాయి. ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో కేటగిరి-4 హరికేన్ ప్రభావం అధికంగా ఉంది. గంటకు 225 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి.

జార్జియా, సౌత్ కరోలినా, నార్త్ కరోలినా, టెనప్సీ గుండా సాగిన హపరికేన్ దాటికి వేలాది చెట్లు కూలిపోయాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రకృతి విపత్తు కారణంగా ఆగ్నేయ అమెరికాలో బిలియన్ల డాలర్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. విద్యుత్‌ సరఫరా వ్యవస్థ దెబ్బతినడం వల్ల దాదాపు 30 లక్షల మంది ప్రభావితమైనట్లు చెప్పారు. అనేక మందికి వరద ముప్పు పొంచి ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories