IMF: భారత్ ఎంత వద్దని మొత్తుకున్నా పాకిస్తాన్ కు ఐఎంఎఫ్ 1 బిలియన్ డాలర్ల రుణం

IMF to give Pakistan $1 billion loan despite Indias objections
x

IMF: భారత్ ఎంత వద్దని మొత్తుకున్నా పాకిస్తాన్ కు ఐఎంఎఫ్ 1 బిలియన్ డాలర్ల రుణం

Highlights

IMF: భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. పాకిస్తాన్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఉగ్రవాదంతో చెలరేగిపోతున్న పాకిస్తాన్ కు...

IMF: భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. పాకిస్తాన్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఉగ్రవాదంతో చెలరేగిపోతున్న పాకిస్తాన్ కు సహాయం చేయకూడదంటూ భారత్ ఐఎంఎఫ్ కు విజ్నప్తి చేసింది. అయినా కూడా ఏమాత్రం పట్టించుకోని ఐఎంఎఫ్ పాకిస్తాన్ 1 బిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసింది. $7 బిలియన్ల ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (EFF) ప్రోగ్రామ్ మొదటి సమీక్షను అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఆమోదించింది. దీని ఫలితంగా పాకిస్తాన్‌కు $1 బిలియన్ తక్షణ రుణ వాయిదా లభించింది. అంతకుముందు, IMF కూడా పాకిస్తాన్‌కు $1.3 బిలియన్ల కొత్త రుణాన్ని అందించింది. దీనితో మొత్తం సహాయ మొత్తం $2.3 బిలియన్లకు చేరుకుంది.

IMF ఈ నిర్ణయం తీసుకునే ప్రక్రియలో భారతదేశం ఓటింగ్ నుండి దూరంగా ఉంది. పాకిస్తాన్‌కు అందిస్తున్న ఆర్థిక సహాయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదంపై పాకిస్తాన్ రికార్డు పేలవంగా ఉందని, ఐఎంఎఫ్ నుండి వచ్చిన నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని భారతదేశం చెబుతోంది. పాకిస్తాన్ మునుపటి IMF కార్యక్రమాల నిబంధనలను పాటించలేదని, దీనివల్ల దాని ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదని భారతదేశం ఆరోపించింది.

పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ IMF ఆమోదం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక స్థిరత్వానికి ఇది ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించారు. భారతదేశం అభ్యంతరాలను తోసిపుచ్చుతూ, పాకిస్తాన్ ఐఎంఎఫ్ షరతులను పాటిస్తున్నదని.. ఆర్థిక సంస్కరణలకు కట్టుబడి ఉందని అన్నారు. కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశంతో ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో పాకిస్తాన్‌కు ఈ ఆర్థిక సహాయం అందుతోంది. ఈ దాడికి పాకిస్తాన్ కారణమని భారతదేశం ఆరోపించగా, పాకిస్తాన్ ఆ ఆరోపణలను ఖండించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories