Pakistan: సొంత దేశాన్నే నాశనం చేసుకుంటున్న పాకిస్థాన్‌.. ఏకంగా కాల్చిపారేశారుగా!

Pakistan
x

Pakistan: సొంత దేశాన్నే నాశనం చేసుకుంటున్న పాకిస్థాన్‌.. ఏకంగా కాల్చిపారేశారుగా!

Highlights

Pakistan: పాకిస్తాన్‌లో టెర్రరిస్టులపై దాడి చేసే క్రమంలో పదిమంది సాధారణ పౌరులు మృతిచెందారు. దీనిపై విచారణ చేస్తామని అక్కడి ప్రభుత్వం తెలిపింది.

Pakistan: పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్ ఖ్వా రాష్ట్రంలోని కట్లాంగ్ అనే కొండ ప్రాంతంలో ప్రభుత్వం చేపట్టిన యాంటీ మిలిటెంట్ ఆపరేషన్ ఘోర మారణహోమానికి దారితీసింది. టెర్రరిస్టులగా భావించి కొందరిని లక్ష్యంగా చేసుకున్న ఆ ప్రాంతంలో పదిమంది సాధారణ పౌరులు మృతి చెందారని అధికారికంగా పాకిస్తాన్ ప్రభుత్వం వెల్లడించింది. సాధారణంగా ఇలాంటి విషయాలను దాచిపెట్టే ఆ దేశం ఈసారి మాత్రం ఉమ్మరించి చెప్పడం వింతగా మారింది.

ప్రాంతీయ ప్రభుత్వ ప్రతినిధి మొహమ్మద్ అలీ సైఫ్ చెప్పిన వివరాల ప్రకారం, మొదట టెర్రరిస్టులు ఆశ్రయంగా ఉన్న చోటుగా భావించి దాడి చేపట్టారట. అయితే ఆ ప్రాంతంలో మిలిటెంట్‌లు కాకుండా సాధారణ పౌరులూ ఉన్నట్టు సమాచారం.

ఈ ఘటనపై అధికార ప్రతినిధి మాట్లాడుతూ, శత్రు లక్ష్యాలను నిష్పాక్షికంగా తొలగించే ప్రయత్నంలోనే ఈ విషాదం చోటుచేసుకుందని తెలిపారు. పౌరుల భద్రతను ఎప్పుడూ ప్రాధాన్యతగా తీసుకుంటామని, కానీ కొన్ని సందర్భాల్లో భూగోళ నిర్మాణం, మిలిటెంట్లు ప్రజల మధ్య దాచుకునే ధోరణి, మరియు ఆపరేషన్ అత్యవసరత వల్ల ఇలాంటివి జరిగే ప్రమాదం ఉంటుందని చెప్పారు.

గాయపడినవారికి వెంటనే వైద్యం అందించడంతోపాటు, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చే ప్రక్రియ కూడా చేపట్టినట్టు ప్రభుత్వం తెలిపింది. అధికారికంగా విడుదలైన ప్రకటనలో, ఈ ఆపరేషన్‌లో ప్రాధాన్యత కలిగిన టెర్రరిస్టులను నిర్మూలించామని వెల్లడించింది. అయితే దీనివల్ల తగిలిన పౌరనష్టాన్ని సఫాగ్ ఆఫ్ వార్' కారణంగా వివరిస్తూ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం కూడా కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories