India-China Direct Flights: భారత్-చైనా మధ్య విమాన రాకపోకలు పునఃప్రారంభం

India-China Direct Flights: భారత్-చైనా మధ్య విమాన రాకపోకలు పునఃప్రారంభం
x
Highlights

India-China Direct Flights: ఐదేళ్ల తర్వాత భారత్‌- చైనాల మధ్య నేరుగా విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి.

India-China Direct Flights: ఐదేళ్ల తర్వాత భారత్‌- చైనాల మధ్య నేరుగా విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. ఇండిగోకు చెందిన ఓ విమానం 176 మంది ప్రయాణికులతో కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చైనాలోని గ్వాంగ్జౌకు బయల్దేరింది. 2020 మార్చి వరకు రెండు దేశాల మధ్య నేరుగా విమానాలు నడిచాయి.

కొవిడ్‌ పరిస్థితులు, గల్వాన్‌ ఘర్షణల పరిణామాల నేపథ్యంలో నిలిచిపోయాయి. నేరుగా విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు కొంతకాలంగా ఇరుదేశాలు పలు దఫాలుగా చర్చలు జరిపాయి. ఈ సేవలను పునరుద్ధరించేందుకు ఇరుదేశాలు అంగీకరించినట్లు భారత విదేశాంగశాఖ ఇటీవల వెల్లడించింది. ఈ క్రమంలోనే తొలి విమానం నేడు చైనాకు టేకాఫ్‌ తీసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories