India Joins UN Honor Roll 2026: అగ్రరాజ్యాలే వెనుకాడుతుంటే.. ఐరాసకు అండగా నిలిచిన భారత్! 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' దేశమంటూ ప్రశంసలు

India Joins UN Honor Roll 2026: అంతర్జాతీయ వేదికపై భారత్ మరోసారి తన బాధ్యతాయుతమైన వైఖరిని చాటుకుంది.
India Joins UN Honor Roll 2026: అంతర్జాతీయ వేదికపై భారత్ మరోసారి తన బాధ్యతాయుతమైన వైఖరిని చాటుకుంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఐక్యరాజ్యసమితి (UN)ని ఆదుకునేందుకు తన 2026 ఏడాది బకాయిలను భారత్ సకాలంలో చెల్లించింది. మొత్తం 35.187 మిలియన్ డాలర్లను (సుమారు రూ. 290 కోట్లు) జమ చేయడం ద్వారా ఐరాస ప్రకటించే ప్రతిష్టాత్మక 'ఆనర్ రోల్' (Honor Roll) జాబితాలో భారత్ చోటు దక్కించుకుంది.
ఆర్థిక సంక్షోభంలో ఐరాస:
అగ్రరాజ్యం అమెరికా సహా పలు అభివృద్ధి చెందిన దేశాలు తమ వాటా నిధులను సకాలంలో చెల్లించకపోవడంతో ఐరాస ప్రస్తుతం ఆర్థిక పతనం అంచున ఉంది. ఈ విషయాన్ని సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ స్వయంగా హెచ్చరించిన తరుణంలో, భారత్ తన నిధులను ముందుగానే విడుదల చేసి తన నిబద్ధతను చాటుకుంది. నిబంధనల ప్రకారం నోటీసు అందిన 30 రోజుల్లోపు నిధులు చెల్లించే దేశాలకు మాత్రమే 'ఆనర్ రోల్'లో చోటు లభిస్తుంది. ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 47 దేశాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి.
ఆసక్తికరమైన క్విజ్‌తో ప్రశంసలు:
ఈ సందర్భంగా ఐరాస ప్రతినిధి స్టెఫాన్ దుజారిక్ విలేకరులతో మాట్లాడుతూ భారత్‌ను వినూత్నంగా ప్రశంసించారు. "ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం ఉన్న దేశం ఏది?" అంటూ క్విజ్ నిర్వహించి, భారత్ తన బకాయిలను పూర్తిగా చెల్లించిందని ప్రకటించారు. ఐరాస రోజువారీ కార్యకలాపాల కోసం భారత్ తన వంతుగా 1.016 శాతం నిధులను కేటాయిస్తోంది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై అంతర్జాతీయంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



