Anita Anand: కెనడాకు తొలి హిందూ విదేశాంగమంత్రి.. ఎవరీ అనితా ఆనంద్?

Anita Anand: కెనడాకు తొలి హిందూ విదేశాంగమంత్రి.. ఎవరీ అనితా ఆనంద్?
x
Highlights

Anita Anand: కెనడా పార్లమెంట్ ఎన్నికల్లో లిబరల్ పార్టీ గెలుపుతో మార్క్ కార్నీ ప్రధానిగా కొనసాగనున్న సంగతి తెలిసిందే. ఈ సారి భారత సంతతికి చెందిన 22...

Anita Anand: కెనడా పార్లమెంట్ ఎన్నికల్లో లిబరల్ పార్టీ గెలుపుతో మార్క్ కార్నీ ప్రధానిగా కొనసాగనున్న సంగతి తెలిసిందే. ఈ సారి భారత సంతతికి చెందిన 22 మంది ఎన్నిక కాగా..నలుగురికి కార్నీ కెబినెట్లో స్థానం లభించింది. అనితా ఆనంద్ విదేశాంగ మంత్రిగా..మనీంద్ర సిధూ అంతర్జాతీయ వాణిజ్య మంత్రిగా బాధ్యతలను చేపట్టనున్నారు. రూబీ సహోతా, రణదీప్ సింగ్ సరాయ్ లు స్టేట్ సెక్రటరీలుగా నియమితులయ్యారు. ఈ నలుగురిలో ముగ్గురు ఒంటారియో రాష్ట్రం నుంచి ఎన్నికయ్యారు.

ఎవరీ అనితా ఆనంద్ ?

న్యాయవేత్త, ప్రఖ్యాత రాజకీయవేత్త అయిన అనితా ఆనంద్ విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు. గతంలో జస్టిన్ ట్రూడో కార్నీ ప్రభుత్వాల్లో నూతన ఆవిష్కరణలు శాస్త్రసాంకేతికశాఖ, జాతీయ రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు. ఒంటారియోలోని ఓక్ విల్లేకి చెందిన అనిత, తమిళ్, పంజాబీ మూలాలు ఉన్న భారతీయ మహిళ. అనితా ఆనంద్ తండ్రి తమిళనాడుకు చెందిన ఫిజీషియన్. ఆమె తల్లి పంజాబ్ కు చెందినవారు. ఆనంద్ ఆక్సస్ ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు.

2019లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. మొదటిసారి ఎంపీగా గెలిచి ట్రూడో కెబినెట్లో చోటుదక్కించుకున్నారు. 2019 నుంచి 2021 వరకు ప్రజారోగ్య మంత్రిగా కోవిడ్ 19 మహమ్మారి కాలంలో వ్యాక్సిన్లు, పీపీఈ కిట్ల కొనుగోళ్ల బాధ్యతలను తానే చేపట్టారు. తర్వాత రక్షణ మంత్రిగా ఉక్రెయిన్ కు సైనిక సహాయ కార్యక్రమాలు తాను ముందుండి నడిపించారు. ఈ ఏడాది జనవరిలో జస్టిన్ ట్రూడో ప్రధానమంత్రి పదవికీ రాజీనామా చేసినప్పుడు ఈ రేసులో అనితా ఆనంద్ పేరు వినిపించింది. కానీ ప్రధాని రేసు నుంచి అనిత తనంతట తానే వైదొలిగారు.

మనీంద్ర సిధూ బ్రాంప్టన్ ఈస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సిధూ..అంతర్జాతీయ వాణిజ్య మంత్రిగా ప్రమోషన్ను పొందారు. 2019లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికైన తర్వాత వరుసగా మూడుసార్లు గెలుపొందారు. సహజ వనరులు, రవాణా, మౌలిక సదుపాయాల అంశాలపై పార్లమెంటరీ స్థాయి కమిటీల్లో పనిచేశారు. 2021లో అంతర్జాతీయ అభివ్రుద్ధిశాఖకు పార్లమెంటరీ కార్యదర్శిగా పనిచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories