Pawan Kalyan: పవన్ కుమారుడిని కాపాడిన భారత కార్మికులకు లైఫ్ సేవర్ అవార్డుతో సత్కారం

Pawan Kalyan: పవన్ కుమారుడిని కాపాడిన భారత కార్మికులకు లైఫ్ సేవర్ అవార్డుతో సత్కారం
x
Highlights

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్లో ఏప్రిల్ 8న జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే....

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్లో ఏప్రిల్ 8న జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ బాలుడు కోలుకుంటున్నాడు. ఈ ప్రమాదం నుంచి మార్క్ సహా కొంతమంది చిన్నారులను నలుగురు భారతీయ వలస కార్మికులు కాపాడారు. ఇటీవల సింగపూర్ ప్రభుత్వం వారిని సత్కరించింది. తాజాగా వారికి లైఫ్ సేవార్ అవార్డులను కూడా ప్రదానం చేసింది. వారి ప్రాణాలు పణంగా పెట్టి పిల్లలను రక్షించినందుకు ఈ అవార్డును ప్రదానం చేసినట్లు సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది.

ఈ ప్రమాదంపై కార్మికులు మాట్లాడారు. మేము చూసే సరికి గదిలో పిల్లలు భయంతో వణుకుతున్నారు. మూడో అంతస్తు నుంచి కొందరు పిల్లలు దూకేయాలని చూశారు. మేం వాళ్లతో మాట్లాడకుండా దూకకుండా చూశాము. తర్వాత వారిని కిందికి తీసుకువచ్చాం. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మరణించింది. ఆమెను కాపాడలేకపోయిందుకు ఇప్పటికే బాధపడుతున్నాం అంటూ విచారం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories