Iran-Israel war: ఇజ్రాయిల్‌పై విరుచుపడుతోన్న ఇరాన్ క్షిపణులు

Iran-Israel war
x

Iran-Israel war: ఇజ్రాయిల్‌పై విరుచుపడుతోన్న ఇరాన్ క్షిపణులు

Highlights

Iran-Israel war: ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ రెండు దేశాలు పోటీపడి మరీ క్షిపణు దాడులు జరుపుతున్నాయి. ఇప్పటికే ఇజ్రాయిల్ ఆపరేషన్ రైజింగ్ పేరుతో మొదలుపెట్టిన యుద్ధంలో పశ్చిమాసియా దద్దరిల్లుతుంది.


Iran-Israel war: ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ రెండు దేశాలు పోటీపడి మరీ క్షిపణు దాడులు జరుపుతున్నాయి. ఇప్పటికే ఇజ్రాయిల్ ఆపరేషన్ రైజింగ్ పేరుతో మొదలుపెట్టిన యుద్ధంలో పశ్చిమాసియా దద్దరిల్లుతుంది. ఇదే సమయంలో ఇప్పుడు ఇరాన్ తాను ఏమాత్రం తీసిపోనని ప్రతిదాడిగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్‌ పేరుతో ఇజ్రాయిల్‌పై క్షిపణుల వర్షం కురిపిస్తుంది.

ఇరాన్‌పై దాడులు చేసేందుకు ఇజ్రాయిల్ ఎన్నడూ లేని విధంగా ప్లాన్ చేసింది. టెహ్రాన్ చుట్టుపక్కల ఉన్న సైనిక స్థావరాలు, అణు కర్మాగాలను టార్గెట్ చేసి మరీ దాడులు చేసింది. ఈ దాడులో ఇరాన్ 78మంది సాధారణ పౌరుల ప్రాణాలను కోల్పోవడమే కాకుండా తీవ్ర నష్టాన్ని చూసింది. ఈ దాడులో 400 మందికి పైనే గాయపడ్డారు. అయితే దీనికి సమాధానంగా తాము జరిపిన దాడుల్లో అణు శాస్త్రవేత్తలు, మిలటరీ కమాండర్లు ఉన్నారని తెలిపింది. ఇప్పుడు ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయిల్‌పై ఆపరేషన్ ట్రూ ప్రామిస్‌ పేరుతో దాడులు మొదలుపెట్టింది. టెల్ అవీవ్, జెరూసలేం నగరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతోంది. ఈ దాడులు కారణంగా చాలా ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ దాడుల్లో ఒకరు మరణించారు. దాదాపు 40 మందికి పైనే గాయపడ్డారని ఇరాన్ సైన్యం వెల్లడించింది. ఇజ్రాయిల్‌లో ఇంకా డజన్లకొద్దీ లక్ష్యాలు ఉన్నాయని వాటినన్నింటినీ నాశనం చేసి తీరతామని శపథం చేపి మరీ ఇప్పుడు మళ్లీ ఇప్పుడు దాడులకు పాల్బడుతోంది.

ఇదిలాఉంటే ఇజ్రాయిల్‌కు అమెరికా సహకారం ఉన్నందున ఇరాన్ మిస్సైళ్లను ఇంటర్ సెప్టార్ క్షిపణులను ప్రయోగిస్తూ ఇజ్రాయిల్ అడ్డుకుంటోంది. ఇరాన్ దాడిచేసిన కొన్ని గంటలలోపే ఇరాన్‌పై ఇజ్రాయిల్ విరుచుకుపడుతుంది. రాజధాని టెహ్రాన్‌తో సహ పలు నగరాలను టార్గెట్‌గా చేసుకుని దాడులు జరుపుతుంది. ఈ లక్ష్యాల్లో ఇస్ఫహాన్ అణుకేంద్రం, ఫోర్డూ అణు కేంద్రాలు ఉన్నట్లు ఇజ్రాయిల్ సైన్యం చెబుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories