Israel: పాక్ మ్యాప్‌లో జమ్ముకశ్మీర్..తప్పైందంటూ భారత్‌కు ఇజ్రాయిల్ క్షమాపణ

Israel
x

Israel: పాక్ మ్యాప్‌లో జమ్ముకశ్మీర్..తప్పైందంటూ భారత్‌కు ఇజ్రాయిల్ క్షమాపణ

Highlights

Israel army apologises: ఇజ్రాయిల్ సైన్యం నిన్న తన అధికారిక ట్విట్టర్‌‌లో పెట్టిన పోస్ట్‌పై తీవ్ర విమర్శలు ఎదుర్కోంది. ఇజ్రాయిల్, భారత్ దేశాల మధ్య దుమారానికి కారణమైంది.

Israel army apologises: ఇజ్రాయిల్ సైన్యం నిన్న తన అధికారిక ట్విట్టర్‌‌లో పెట్టిన పోస్ట్‌పై తీవ్ర విమర్శలు ఎదుర్కోంది. ఇజ్రాయిల్, భారత్ దేశాల మధ్య దుమారానికి కారణమైంది. ఇరాన్‌ను ప్రపంచ ముప్పుగా టెల్ అవీవ్ భావిస్తుందన్నది నొక్కి చెప్పే ట్వీట్‌లో ఆ దేశ ఆర్మీ పాకిస్తాన్ మ్యాప్‌ని కూడా పోస్ట్ చేసింది. అయితే ఈ మ్యాప్‌లో జమ్ముకశ్మీర్‌‌ ఉంది. దీంతో భారతదేశ అంతర్జాతీయ సరిహద్దులను తప్పు చూపించినందుకు ఇజ్రాయిల్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. చాలామంది చాలా కోపంగా లోపాన్ని ఎత్తి చూపుతూ ఇజ్రాయిల్ సైన్యం పోస్ట్‌ను ఉపసంహరించుకోవాలని కోరాఉ. మరికొందరు ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహును కూడా ట్యాగ్ చేశారు.

ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య కొంతకాలంగా ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరింది. ఇజ్రాయిల్.. ఇరాన్ సైనిక, అణు స్థావరాలపై దాడులు చేస్తుంది. ఈ సమయంలో ఇరాన్‌లోని క్షిపణి సామర్ధ్యాన్ని వివరిస్తూ ఇజ్రాయిల్ ఐడిఎఫ్​ ఒక మ్యాప్‌ను ట్విట్టర్‌‌లో పోస్ట్ చేసింది. అయితే ఈ మ్యాప్‌లో భారతలో భాగమైన జమ్ముకశ్మీర్‌‌ను పాక్‌లో ఉన్నట్టు చూపించింది.

దీంతో ఇజ్రాయిల్ చాలా విమర్శలు ఎదుర్కోంది. గతంలో కూడా ఒకసారి ఇజ్రాయిల్ ఇదే తప్పు చేసింది. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేయడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కోంది. భారత్‌కు మిత్రదేశమైనా కూడా తమ దేశంలో అంతర్బాగమైన జమ్ముకశ్మీర్‌‌ను వేరొక సరిహద్దు దేశానికి చెందిన మ్యాప్‌లో చూపించడం బాధాకరం నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో వెంటనే ఇజ్రాయిల్ ఐడిఎఫ్.. ఈ పోస్ట్ ఇలా పెట్టడం ఒక దురదృష్టకరమని, సరిహద్దులను కచ్చితంగా చూపించడంలో విఫలమయ్యామని వివరిస్తూ క్షమాపణలు చెప్పింది. ఈ మ్యాప్‌ వల్ల ఎవరు బాధపడ్డా.. అందరికీ క్షమాపణలు అంటూ ఐడిఎఫ్ తన తర్వాత పోస్ట్‌లో వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories