S.Jaishankar: చరిత్రలోనే తొలిసారిగా తాలిబాన్ మంత్రితో జైశంకర్ చర్చలు.. వైరల్ అవుతున్న ఇరు దేశాల ట్వీట్స్

Jaishankars talks with Taliban minister Tweets from both countries going viral
x

 S.Jaishankar: చరిత్రలోనే తొలిసారిగా తాలిబాన్ మంత్రితో జైశంకర్ చర్చలు.. వైరల్ అవుతున్న ఇరు దేశాల ట్వీట్స్

Highlights

S.Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గురువారం తాలిబాన్ల తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముక్తాకితో అధికారికంగా ఫోన్లో మాట్లాడారు....

S.Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గురువారం తాలిబాన్ల తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముక్తాకితో అధికారికంగా ఫోన్లో మాట్లాడారు. ఆఫ్టాన్ తాలిబన్ ప్రభుత్వంతో భారత్ చేసిన తొలి మంత్రిస్తాయి సంప్రదింపులు కావడంతో సర్వత్రా ప్రాముఖ్యత సంతరించుకుంది. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులను చంపడంపై యావత్ ప్రపంచం తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆఫ్ఘన్ తాలిబన్ ప్రభుత్వం కూడా ఈ దాడికి తీవ్రంగా ఖండించడాన్ని మంత్రిజైశంకర్ స్వాగతించారు. ఈ విషయాన్ని మంత్రి జైశంకర్ స్వయంగా తన అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. తాలిబన్ తో తొలిసారి మంత్రిత్వ స్థాయి చర్యలు జరపడం గమనార్హం. తాలిబన్ ప్రభుత్వంతో ఫోన్ సంభాషణ తర్వాత జైశంకర్..ఈ రోజు సాయంత్రం తాత్కాలిక ఆఫ్గన్ విదేశాంగ మంత్రి మౌలవి అమీర్ ఖాన్ ముత్తాకీతో సంబాషణ జరిగింది. పహల్గామ్ ఉగ్రదాడిని ఆయన ఖండించడం నిజంగా హర్షణీయం. ఆప్ఘన్ ప్రజలతో భారత్ సాంప్రదాయ స్నేహాన్ని కొనసాగిస్తాం. వారి అభివ్రుద్ధి అవసరాలకు సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే అంశాలపై చర్చించామని ఎక్స్ అకౌంట్లో పోస్టు పెట్టారు.

జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఘటనకు తాలిబాన్లతో ముడిపెడుతున్నారని ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ తప్పుడు ప్రచారంచేసిందని తాలిబాన్లు మండిపడుతున్నారు. భారత్ ప్రయోగించిన ఓ క్షిపణి ఆప్ఘాన్ భూభాగంలో పడినట్లు పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేసింది. అయితే దీన్ని కాబుల్ తీవ్రంగా ఖండించింది. తమకు ఎలాంటి హాని జరగలేదని అదంతా అవాస్తవం అంటూ వెల్లడించింది. ఇలాంటి తప్పుడు నిరాధారమైన ప్రచారాల ద్వారా భారత్ ఆప్ఘాన్ మధ్య అపనమ్మకాన్ని స్రుష్టించడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలను ఆఫ్ఘన్ తిరస్కరించడాన్ని జైశంకర్ స్వాగతించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories