Japan: జపాన్‌లో వరుస భూకంపాలు.. భయంతో వణికిపోతున్న ప్రజలు..వాంగా చెప్పింది నిజమౌతుందా?

Japan: జపాన్‌లో వరుస భూకంపాలు.. భయంతో వణికిపోతున్న ప్రజలు..వాంగా చెప్పింది నిజమౌతుందా?
x
Highlights

Japan: జపాన్‌లో వరుస భూకంపాలు జనాల్ని నిద్రలేకుండా చేస్తున్నాయి. మారూమూల ద్వీపాల్లో గ్యాప్‌ లేకుండా భూకంపాలు సంభవిస్తున్నాయి.

Japan: జపాన్‌లో వరుస భూకంపాలు జనాల్ని నిద్రలేకుండా చేస్తున్నాయి. మారూమూల ద్వీపాల్లో గ్యాప్‌ లేకుండా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇప్పటివరకు 2 వారాల్లో 900కి పైనే భూకంపాలు సంభవించినట్లు లెక్కలు చెబుతున్నాయి. దీంతో ప్రజలు రాత్రిళ్లు నిద్రపోకుండా భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచి వస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ వరుస భూకంపాలు జపాన్ వాంగా బాబా చెప్పిన భారీ సునామీకి సంకేతమా? అంటూ కొంతమంది ఆలోచిస్తున్నారు.

దాదాపు రెండు వారాల నుంచి జపాన్‌లో ఉన్న టోకారా దీవుల్లో వరుస భూకంపాలు సంభవించాయి. ఇటీవల వచ్చిన భూకంపం రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది. దీంతో చుట్టుపక్కలున్న జనం భయంతో వణికిపోతున్నారు. అయితే ఇప్పటివరకు వచ్చిన భూకంపాలతో ఎలాంటి నష్టం జరగలేదని, ముందు ముందు ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నా.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే జపనీస్ బాబా వాంగాగా పాపులర్ అయిన రియో తత్సూకి జులై 5న జపాన్‌ను పెద్ద ఎత్తున సునామీ చుట్టుముడుతుందని, ఈ సునామీలో పలు నగరాలు కొట్టుకుపోతాయని జోస్యం చెప్పింది. అంతేకాదు

జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య ఉన్న పసిఫిక్ మహా సముద్రంలో నీటి అడుగున ఉన్న అగ్నిపర్వతం పేలుతుందని, ఆ తర్వాత పెద్ద ఎత్తున భూకంపం, సునామీలు వస్తాయని జపనీస్ వాంగా అంచనా వేసింది. అయితే ఇప్పుడు కొన్ని దీవుల్లో వరుస భూకంపాలు సంభవించడం వాంగా జోస్యానికి సంకేతమేమోనని జపాన్ ప్రజలు వణికిపోతున్నారు. అసలు జులై 5న ఏం జరగబోతోందోనని అరచేతిలో ప్రాణాలు పట్టుకున్నట్టు టెన్షన్ పడిపోతున్నారు.

2011లో ఈశాన్య జపాన్ పై సునామీ విరుచుకుపడింది. అప్పుడు సంభవించిన భూకంపం, సునామీ కూడా రియో ముందుగానే అంచనా వేసి హెచ్చరించిందే. అయితే అప్పుడు భారీ భూకంపం, సునామీ ముందుగానే చెప్పారు. అది జరిగింది. కాబట్టి ఇది కూడా జరగొచ్చునేమో అని అనుమానం పడుతూ ప్రజలు భయంతో వణుకుతున్నారు.

అయితే జపాన్‌లో ఎప్పుడూ భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. భూమిపై అత్యంత భూకంప ప్రమాదం ఉన్న దేశాల్లో మొదటి దేశం జపానే. టెక్టోనిక్ ప్లేట్లు కలిసే.. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రదేశంలో ఉండటంతో తరచూ భూకంపాలు వస్తుంటాయి. జపాన్ ప్రతీ ఏడాది దాదాపుగా 1500 భూకంపాలను ఎదుర్కొంటూ ఉంటుంది. ఇటీవల కూడా 12 టోకారా దీవుల్లో వరుస భూకంపాలు సంభవించాయి. ఇక్కడ 700 మంది వరకు జీవిస్తారు. ఎక్కువగా టూరిస్టులు ఇక్కడకు వస్తుంటారు. ఈ భూకంపాల కారణంగా ఇప్పటికే టోకారా దీవులోనూ కొన్ని గెస్ట్ హౌస్‌లు మూతబడ్డాయి. ఈ సంవత్సరం టూరిజం ఎలా ఉంటుందోనని దానిపై ఆధారపడి జీవిస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories