Japan Twitter Killer: జపాన్ ‘ట్విటర్ కిల్లర్‌‌’ని ఉరితీసిన కోర్టు

Japan Twitter Killer
x

Japan Twitter Killer: జపాన్ ‘ట్విటర్ కిల్లర్‌‌’ని ఉరితీసిన కోర్టు

Highlights

Japan Twitter Killer: 2017లో సంచలనం సృష్టించిన ట్విటర్ కేసులో ట్విటర్ కిల్లర్‌‌గా వైరల్‌ అయిన తకిహిరోకు ఎట్టకేలకు కోర్టు ఉరిశిక్ష విధించింది.

Japan Twitter Killer: 2017లో సంచలనం సృష్టించిన ట్విటర్ కేసులో ట్విటర్ కిల్లర్‌‌గా వైరల్‌ అయిన తకిహిరోకు ఎట్టకేలకు కోర్టు ఉరిశిక్ష విధించింది. టోక్కోలోని ఒక అపార్ట్ మెంట్‌లో 9 మందిని హత్య చేసిన ఘటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం అయింది. చనిపోవాలనుకుంటున్నామని అప్పుడప్పుడు పోస్టులు పెట్టిన వాళ్లని, ట్విటర్ ద్వారా గేదర్ చేసి.. వాళ్లందరినీ ఒక అపార్ట్‌మెంట్‌లో కర్కసంగా చంపాడు.

జపాన్‌లోని టోక్యో నగరం 2017లో ఒక్కసారిగా భయంతో వణికి పోయింది. 9 మందిని తకహిరో షిరైషి అనే వ్యక్తి ఒక అపార్ట్ మెంట్‌లో చంపడంతో అప్పట్లో ఈ కేసు వైరల్ అయింది. ఆ సమయంలో అతడు ట్విటర్ కిల్లర్‌‌గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. తాజాగా టోక్యో కోర్టు ఎట్టకేలకు అతడికి మరణశిక్ష విధించింది. టోక్యో అధికారులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి.

టోక్యోలోని ఒక అపార్ట్ మెంట్‌లోని ఒక ఫ్లాట్‌లో ఎనిమిది మంది మహిళలు, ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అనుమానం వచ్చిన పోలీసులు ఆ ఫ్లాట్‌కు చెందిన తకహీరో షిరైషి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో షిరైషి చెప్పిన విషయాలు చూసి పోలీసులు విస్తు పోయారు.

తాను చంపిన 9 మంది సోషల్ మీడియాలో ఆత్మహత్యలు చేసుకోవాలని అనుకున్నారని, ఆ తర్వాత ట్విటర్ ద్వారా వాళ్లందరినీ తాను సంప్రదించి, వాళ్లు చనిపోవడానికి సాయం చేశానని షిరైషి అప్పట్లో పోలీసులకు చెప్పాడు. వాళ్లు చనిపోవాలని అనుకున్నందువల్లే వాళ్లందరినీ ఇంటికి పిలిపించి చంపానని వెల్లడించడంతో పోలీసులు విస్తుపోయారు. ఈ తొమ్మది మందిలో ఎనిమిది మంది మహిళలు, ఒక వ్యక్తి ఉన్నారు. వీరందరినీ కూడా తన ఫ్లాట్‌లో షిరైషి హత్య చేశాడు. మృతుల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. అయితే ఎనిమిది మంది మహిళలపై అత్యాచారం చేసి, ఆ తర్వాత చంపినట్లు ధర్యాప్తులో తేలింది. అంతేకాదు, హత్యలు చేసిన తర్వాత షిరైషి వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా చేసి బాక్సుల్లో పెట్టాడు.

ఈ భయానకమైన హత్యలు అప్పట్లో పెను సంచలనమయ్యాయి. ఈ హత్యలతో షిరైషీ ట్విటర్ కిల్లర్ గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. కేసు ధర్యాప్తు చేసిన తర్వాత కోర్టు అంటే 2020లో షిరైషీకి ఉరిశిక్ష విధించింది. కానీ, జపాన్‌లో కొంతకాలంగా ఉరిశిక్షలను రద్దుచేయాలని నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఉరిశిక్ష అమలు కాలేదు. అయితే మూడేళ్ల క్రితమే డిటెన్షన్ హౌస్‌లో షిరైషీని ఉరితీసారు. కానీ అతడి ఉరిశిక్షను బయటకు వెల్లడించకూడదని అనుకుని, తాజాగా పోలీసులు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories