Japan's Kansai Airport: సముద్రంపై జపాన్ అద్భుత విమానాశ్రయం.. త్వరలో సముద్రంలో మునిగిపోతుందా?

Japan Kansai Airport
x

Japan's Kansai Airport: సముద్రంపై జపాన్ అద్భుత విమానాశ్రయం.. త్వరలో సముద్రంలో మునిగిపోతుందా?

Highlights

Japan's Kansai Airport: ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన తేలియాడే విమానాశ్రయం జపాన్‌లోఉంది. అయితే ఇది త్వరలో సముద్రంలోకి మునిగిపోతుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

Japan's Kansai Airport: ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన తేలియాడే విమానాశ్రయం జపాన్‌లోఉంది. అయితే ఇది త్వరలో సముద్రంలోకి మునిగిపోతుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దాదాపు 20 బిలియన్ డాలర్లు ఖర్చుపెట్టి జపాన్ ప్రభుత్వం దీన్ఇన నిర్మించింది. అయితే ఇది నెమ్మది నెమ్మదిగా సముద్రంలోకి మునిగిపోతుందని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..

జపాన్ అద్భుత సృష్టి, అత్యాధునిక టెక్నాలజీకి పెట్టింది పేరు. 1980లో జపాన్‌లోని గ్రేటర్ ఒసాకా బేలో మానవ నిర్మిత ద్వీపంపై ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. దీనిపేరు కాన్సాయ్ ఎయిర్ పోర్టు. ఈ విమానాశ్రయాన్ని ఆధునాతన గ్రౌండ్ ఇంప్రూవ్ మెంట్‌ టెక్నిక్‌లను ఉపయోగించి ప్రతష్టాత్మకంగా నిర్మించారు. అంతర్జాతీయంగా కూడా ఇది గుర్తింపు పొందింది. ఎన్నో అవార్డులు అందుకుంది. ఈ విమానాశ్రయం 1994లో ప్రారంభమైంది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో సేవలను అందించింది. అందుకే 2024లో ప్రపంచంలోనే అత్యుత్తమ లగేజీ నిర్వహణ విమానాశ్రయంగా పేరు పొందింది.

దాదాపు పదేళ్లకు పైగా ప్రయాణికుల లగేజీ మిస్ కూడా ఖచ్చితమైన రికార్డ్‌ ను కూడా ఈ ఎయిర్ పోర్టు సొంతం చేసుకుంది. జపాన్‌లోని ఎయిర్ పోర్టులో రద్దీని తగ్గించడానికే దీన్ని ఒసాకాలో నిర్మించారు. అంతేకాదు 2024లో దాదాపు 30 మిలియన్ల మందికి పైగా ప్రయాణికులు ఇక్కడ నుంచి 25 దేశాల్లోని 91 నగరాలకు ప్రయాణించారు. అయితే ఇప్పుడు ఈ ఎయిర్ పోర్టులో కొంచెం కొంచెంగా సముద్రంలోకి మునిగిపోతుంది.

ఈ మధ్య కాలంలో ఒసాకా ఎయిర్ పోర్ట్‌ లో నెమ్మది నెమ్మదిగా సముద్రంలోకి మునిగిపోతుంది. రెండు ఆర్టిఫిషియల్ ద్వీపాలపై నిర్మించిన ఈ విమానాశ్రయం ఒక ద్వీపంలో ఇప్పటిదాకా 13.66 మీటర్లు కుంగిపోయిందని, అలాగే రెండో ద్వీపంలో 21 సెంమీ కుంగిపోయిందని కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఇంకొన్ని సంవత్సరాల్లో ఇది పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నాయి. దీంతో నష్టాన్ని తగ్గించుకోడానికి జపాన్ ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది.

అయితే విమానాశ్రయం మునిగిపోడానికి ముఖ్య కారణం ఏంటంటే.. తుఫాన్. 2018లో వచ్చిన టైఫూన్ జెబీ తుఫాన్ తాకిడికి ఈ విమానాశ్రయానికి దెబ్బపడింది. ఆ సమయంలోనే ఇది మునిగిపోవడం మొదలైంది. ఆ తర్వాత ఇక నెమ్మది నెమ్మదిగా దీని ఇంజనీరింగ్‌లోని లోపాలు బయటపడ్డాయి. ఈ విమానాశ్రయానికి సంబంధించిన డిజాస్టర్ రెస్పాన్స్ కేంద్రం, కరెంట్ సబ్ స్టేషన్లు దీని భూగర్భంలో ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా వరదల్లో చిక్కుకుపోయాయి. దీనివల్ల 5వేల మంది ప్రయాణికులు 24 గంటలపాటు విద్యుత్ లేకుండా గడిపారు. అప్పటినుంచి అధికారులు ఈ విమానశ్రయంపై దృష్టి పెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories