NASA: నాసా చీఫ్‌గా మస్క్ వ్యాపారభాగస్వామి.. ఎవరీ జేర్డ్ ఐజాక్ మెన్?

Jared Isaacman as Nasa Chief
x

Nasa: నాసా చీఫ్‌గా మస్క్ వ్యాపారభాగస్వామి.. ఎవరీ జేర్డ్ ఐజాక్ మెన్?

Highlights

Jared Isaacman: నాసా చీఫ్ గా బిలియనీర్, ప్రైవేట్ వ్యోమగామి జేర్డ్ ఐజాక్ మెన్ ను నామినేట్ చేశారు డోనల్డ్ ట్రంప్.

Jared Isaacman: నాసా చీఫ్ గా బిలియనీర్, ప్రైవేట్ వ్యోమగామి జేర్డ్ ఐజాక్ మెన్ ను నామినేట్ చేశారు డోనల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ 2025 జనవరిలో బాధ్యతలు చేపట్టనున్నారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందే కీలకమైన స్థానాల్లో నియామకాలు చేపడుతున్నారు. ఐజాక్ మెన్ స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ వ్యాపార భాగస్వామి.ఐజాక్ మెన్ నాయకత్వంలో నాసా మరింత పురోగతి సాధించే అవకాశం ఉందని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. స్పేస్ సైన్స్ , టెక్నాలజీలో సరికొత్త లక్ష్యాలను చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

షిఫ్ట్ పేమెంట్స్ కంపెనీ సీఈవో గా ఐజాక్ మెన్ కొనసాగుతున్నారు. ఆయన తన 16 ఏటలోనే ఈ కంపెనీని ప్రారంభించారు. రెండుసార్లు ఆయన అంతరిక్షంలోకి వెళ్లారు. అంతరిక్షంలో స్పేస్ వాక్ చేసిన తొలి ప్రైవేట్ వ్యోమగామిగా ఆయన గుర్తింపు పొందారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో స్పేస్ ఎక్స్ పొలారిస్ డాన్ ప్రాజెక్టు కింది నలుగురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లారు. ఈ నలుగురిలో ఆయన ఒకరు. స్పేస్ ఎక్స్ కార్యకలాపాల్లో ఆయనది కీలకపాత్రగా చెబుతారు. స్పేస్ ఎక్స్ వాణిజ్య విమానాలకు కమాండ్, నిధులను ఆయన సమకూర్చారు.

ప్రస్తుత అడ్మినిస్ట్రేటర్ మరియు మాజీ ఫ్లోరిడా డెమోక్రటిక్ సెనేటర్ బిల్ నెల్సన్ స్థానాన్ని భర్తీ చేయనున్న ఐసాక్‌మాన్, ప్రైవేట్ వ్యోమగామి మిషన్లలో తన ప్రమేయం కోసం అంతరిక్ష సంఘంలో సుప్రసిద్ధుడు. మస్క్ యొక్క వ్యాపార సహాయకుడు, ఐసాక్మాన్ రెండు ముఖ్యమైన SpaceX వాణిజ్య విమానాలకు కమాండ్ మరియు నిధులు సమకూర్చాడు. సెప్టెంబరు 2021లో SpaceX యొక్క క్రూ డ్రాగన్‌లో అతను మొట్టమొదటి పౌర-సివిలియన్ మిషన్‌కు నాయకత్వం వహించారు.

1983 ఫిబ్రవరి 11న న్యూజెర్సీలో ఆయన జన్మించారు. 16 ఏళ్ల వయస్సులోనే ఉన్నత పాఠశాల విద్య నుంచి తప్పుకున్నారు. అయితే పాఠశాల విద్య డిప్లొమాతో సమానమైన జనరల్ ఎడ్యుకేషన్ డెవలప్ మెంట్ పట్టా పొందారు. ఈ పట్టా పొందిన తర్వాత ఆయన తన పేరేంట్స్ వద్ద పని చేశారు. భార్య, ఇద్దరు కూతుళ్లతో తూర్పు పెన్సిల్వేనియాలో ఆయన నివాసం ఉంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories