ఒకటైన జెఫ్ బెజోస్, లారెన్ శాంచెజ్.. వెనిస్‌లో అంగరంగ వైభవంగా వివాహ వేడుక!

ఒకటైన జెఫ్ బెజోస్, లారెన్ శాంచెజ్.. వెనిస్‌లో అంగరంగ వైభవంగా వివాహ వేడుక!
x

ఒకటైన జెఫ్ బెజోస్, లారెన్ శాంచెజ్.. వెనిస్‌లో అంగరంగ వైభవంగా వివాహ వేడుక!

Highlights

Jeff Bezos: అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ అగ్ర ధనవంతుల్లో ఒకరైన జెఫ్ బెజోస్ (61) తన ప్రేయసి, మాజీ న్యూస్ యాంకర్ లారెన్ శాంచెజ్ (55)తో వివాహ బంధంలోకి ప్రవేశించారు.

అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ అగ్ర ధనవంతుల్లో ఒకరైన జెఫ్ బెజోస్ (61) తన ప్రేయసి, మాజీ న్యూస్ యాంకర్ లారెన్ శాంచెజ్ (55)తో వివాహ బంధంలోకి ప్రవేశించారు. ఇటలీకి చెందిన సుందర నగరం వెనిస్‌లో శుక్రవారం అట్టహాసంగా ఈ పెళ్లి వేడుక జరిగింది. ఈ ఘన వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు, కోటిశ్వరులు హాజరయ్యారు. అయితే ఒకవైపు ఈ వేడుక శోభాయమానంగా సాగుతుండగా, మరోవైపు నగరవ్యాప్తంగా నిరసనలూ వెల్లివిరిశాయి.

ఇటలీ మీడియా కథనాల ప్రకారం, సెయింట్ మార్క్స్ స్క్వేర్‌కు ఎదురుగా ఉన్న చారిత్రక శాన్ జార్జియో మాగ్గియోర్ ద్వీపంలో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. ఓపెన్ ఎయిర్ యాంఫిథియేటర్‌లో బ్లాక్-టై థీమ్‌తో వేడుకను ఏర్పాటు చేశారు. ప్రముఖ ఒపెరా గాయకుడు ఆండ్రియా బోసెల్లి కుమారుడు మాటియో బోసెల్లి తన గానం ద్వారా వధూవరులను, అతిథులను అలరించాడు. మిషెలిన్-స్టార్ చెఫ్ ఫాబ్రిజియో మెల్లినో విందు భోజనాన్ని సిద్ధం చేయగా, ప్రఖ్యాత పేస్ట్రీ చెఫ్ సెడ్రిక్ గ్రోలెట్ ప్రత్యేకంగా కేక్‌ను రూపొందించారు.

వేడుకల కోసం బెజోస్, శాంచెజ్ 16వ శతాబ్దానికి చెందిన విలాసవంతమైన అమన్ హోటల్‌లో బస చేశారు. ఈ వేడుకకు కిమ్ కర్దాషియన్, ఓప్రా విన్‌ఫ్రే, ఓర్లాండో బ్లూమ్, టామ్ బ్రాడీ, గాయకుడు ఉషర్, జోర్డాన్ రాణి రానియా, ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్నర్ తదితరులు ప్రత్యేక బోట్లపై హాజరయ్యారు. వివాహ అనంతరం లారెన్ శాంచెజ్ తన ఇన్‌స్టాగ్రామ్ యూజర్ నేమ్‌ను ‘లారెన్ శాంచెజ్ బెజోస్’గా మార్చారు. పెళ్లి దుస్తుల్లో ఉన్న తన ఫోటోను కూడా పంచుకున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories