Jerome Kerviel: బిలియన్ డాలర్ ట్రేడర్ నుంచి.. ప్రపంచపు "అత్యంత పేదవాడు"గా మారిన జెర్నీ!

Jerome Kerviel: బిలియన్ డాలర్ ట్రేడర్ నుంచి.. ప్రపంచపు అత్యంత పేదవాడుగా మారిన జెర్నీ!
x

Jerome Kerviel: బిలియన్ డాలర్ ట్రేడర్ నుంచి.. ప్రపంచపు "అత్యంత పేదవాడు"గా మారిన జెర్నీ!

Highlights

వేళ్లలో తారసపడినంత వేగంగా పతనమైంది అతడి జీవిత గమ్యం. ప్రపంచాన్ని ఒక్కసారి కుదిపేసిన ఆర్థిక కుంభకోణం వెనుక ఉన్న పేరు – జెరోమ్ కెర్వియల్.

వేళ్లలో తారసపడినంత వేగంగా పతనమైంది అతడి జీవిత గమ్యం. ప్రపంచాన్ని ఒక్కసారి కుదిపేసిన ఆర్థిక కుంభకోణం వెనుక ఉన్న పేరు – జెరోమ్ కెర్వియల్. ఒకప్పుడు ఫ్రాన్స్‌లోని ప్రముఖ బ్యాంక్‌కు బిలియన్ డాలర్ల విలువైన ట్రేడింగ్‌లు చేసిన కెర్వియల్.. చివరికి అదే వ్యవస్థ అతడిని క్రిందకు తొక్కేసింది. ఈరోజు అతడు ‘ప్రపంచపు అత్యంత పేదవాడు’గా పేరుపొందినా.. దాని వెనుకున్న కథ అసాధారణం.

చిన్నతనం నుంచి చురుకైన కెర్వియల్

1977లో ఫ్రాన్స్‌లో జన్మించిన కెర్వియల్‌ సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. తండ్రి మెటల్ వర్కర్, తల్లి బ్యూటీషియన్. అన్ని కష్టాల మధ్య చదువు పూర్తి చేసి ల్యూమియర్ యూనివర్శిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో మాస్టర్స్ పూర్తిచేశారు. 2000లో సొసైటీ జనరల్ అనే బ్యాంక్‌లో జూనియర్ ట్రేడర్‌గా చేరారు. ట్రేడింగ్‌పై మంచి పట్టుతో పాటు, IT వ్యవస్థలపై కూడా మంచి అవగాహన కలిగిన కెర్వియల్‌కు యాజమాన్యం స్వేచ్ఛ ఇచ్చింది. అదే అతడి పతనానికి కారణమైంది.

అనధికారిక ట్రేడింగ్‌తో భారీ నష్టం

2006–2008 మధ్యకాలంలో, కెర్వియల్ సంస్థ అనుమతికి మించి భారీగా ట్రేడింగ్ చేశాడు. నకిలీ లావాదేవీలు సృష్టించి వాటిని దాచిపెట్టాడు. మొదట లాభాలు వచ్చినందున యాజమాన్యం ప్రశంసించింది. కానీ 2008 ఆర్థిక మాంద్యంతో నిజాలు బయటపడ్డాయి. బ్యాంక్‌కి 4.9 బిలియన్ యూరోలు (రూ. 4.95 లక్షల కోట్లు) నష్టం వాటిల్లినట్టు అధికారిక ప్రకటన వెలువడింది.

అరెస్టు, జైలు, కోర్టు తీర్పులు

తర్వాత పోలీసులు కెర్వియల్‌ను అరెస్ట్ చేశారు. 2010లో కోర్టు అతడికి 5 ఏళ్ల జైలు, అలాగే నష్టపరిచిన మొత్తం తిరిగి చెల్లించాలనే తీర్పు వెలువరించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అతడు అత్యంత పేదవాడుగా మారిపోయాడు. అయితే కెర్వియల్ వాదన వేరు – “లాభాలు ఉన్నప్పుడు మౌనంగా ఉన్న యాజమాన్యం.. నష్టం వచ్చినపుడు నన్నే ఎందుకు బాధ్యత వహించమంటోంది?”

నిరంకుశ వ్యవస్థపై వ్యతిరేక పాదయాత్ర

2014లో విడుదలైన తర్వాత కెర్వియల్ రోమ్ నుంచి పారిస్‌ వరకు 1300 కిలోమీటర్లు నడిచి ఆర్థిక వ్యవస్థల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సందేశమిచ్చాడు. 2016లో లేబర్ కోర్టు అతడి ఉద్యోగ విరమణను తప్పుపట్టి, 4.5 లక్షల యూరోలు పరిహారం ఇవ్వాలంటూ తీర్పు ఇచ్చింది. ఇక, మొదట పేర్కొన్న 7.2 బిలియన్ డాలర్ల నష్టం నిజంగా లేదు అంటూ సంస్థ 2022లో స్పష్టం చేసింది. వాస్తవ నష్టం కేవలం 1 మిలియన్ యూరోలు మాత్రమేనని వెల్లడించింది.

ఇప్పుడు ప్రశాంత జీవితం

అత్యంత సంచలనాత్మక ఆర్థిక కుంభకోణాల్లో ఒకటి కారణంగా చరిత్రలో నిలిచిపోయిన కెర్వియల్, ఇప్పుడు పారిస్‌లో సాదా జీవితం గడుపుతున్నారు. ఓ ఐటీ కన్సల్టింగ్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories